రాష్ట్రీయం

కొత్త భవనాలకు ‘పెద్దనోట్ల’ గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లా కేంద్రాల్లో ‘కార్యాలయ భవనాల సముదాయా’లను నిర్మించాలని రూపొందించిన ప్రణాళికకు గ్రహణం పట్టింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితులే ఇందుకు కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం వంద కోట్ల రూపాయలతో జిల్లా కార్యాలయ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని ప్రతిపాదించారు. ఒక్కో జిల్లాలో సరాసరిన లక్షాయాభైవేల చదరపు అడుగుల వైశాల్యంతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలని ప్రతిపాదించారు. రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి సవివరంగా చర్చించారు. ఈ భవనాలకు ఆ జిల్లాలో ప్రముఖులైన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, యువజన, పర్యాటకం, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు తదితర అన్ని శాఖల జిల్లాస్థాయి కార్యాలయాలకు ఇదే భవనంలో వసతి కల్పించాలని నిర్ణయించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో ఇందుకోసం నిధులు కేటాయించాలని నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ ఇందుకోసం ప్లాన్‌ను సిద్ధం చేసింది. జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేస్తూ, జిల్లా కార్యాలయ భవనాల సముదాయాలకోసం అవసరమైన భూమిని సేకరించి ఉంచాలని, ఈ స్థలం ఎలాంటి వివాదాల్లో ఉండకూడదని, ప్రశాంతమైన వాతావరణంలో స్థలం ఉండేలా చూడాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు అనుగుణంగా దాదాపు అన్ని జిల్లాల (21 జిల్లాల) కలెక్టర్లు యుద్ధప్రాతిపదికన స్థలాలను కూడా గుర్తించారు. కొత్త సంవత్సరంలో శంకుస్థాపనలు చేసి వీలైనంత త్వరలో భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలని భావించారు. అయితే పెద్దనోట్ల రద్దు ప్రభావంతో జిల్లా కార్యాలయ భవనాలకు నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నియమ నిబంధనల ప్రకారం రవాణా, రోడ్లు, భవనాల (టి, ఆర్ అండ్ బి) శాఖ జిల్లా కార్యాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఈ శాఖ ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కేంద్ర సాయంతో నడుస్తున్నవే. నాబార్డ్ మంజూరు చేసిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా ఈ శాఖ కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా కార్యాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని టి ఆర్ అండ్ బి సిద్ధమైంది. అనుకోకుండా ఏర్పడ్డ ఆర్థిక పరిస్థితులతో ఈ భవనాల నిర్మాణ ప్రతిపాదనలకు గ్రహణం పట్టినట్లయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరమైన పనులకే నిధులు కేటాయిస్తోంది. ప్రభుత్వ సిబ్బంది వేతనాలతోపాటు వైద్యం, ఆరోగ్యం, పింఛన్లు, విద్యార్థుల ఫీజులు, హోం తదితర అత్యవసరమైన పనులకు మాత్రమే మరో నాలుగు నెలలపాటు నిధులు విడుదల చేయాలని, ఆ తర్వాత కూడా ప్రాధాన్యతా రంగాలకే నిధులివ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త భవనాల నిర్మాణం వెనుక్కు వెళుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాతే కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రాష్టస్థ్రాయిలో సచివాలయ కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించాలని తలపెట్టినప్పటికీ, వివిధ కారణాల వల్ల వాయిదాపడ్డ విషయం ఈ సందర్భంగా గమనార్హం.