ఆంధ్రప్రదేశ్‌

హైటెక్ నుంచి వెల్ఫేర్‌కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే రాజధాని లేని రాష్ట్రం. ఆపై రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్. గ్రామీణ ప్రాంతాలే తప్ప హైదరాబాద్ మాదిరిగా పెద్ద నగరం నుంచి ఆదాయం లేదు. సమర్థులైన ఐఏఎస్‌లంతా తెలంగాణకు వెళ్లగా, మిగిలిన వారే దిక్కయిన దుస్థితి. ఇంకోవైపు ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలకే లక్షా80 వేల కోట్లు అనివార్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అడ్డంకులు అనేకం.. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణ అడ్డంకులు అధిగమించేందుకే ఏడాది పట్టిన వైనం. పోనీ సమర్థులైన మంత్రులున్నారా అంటే ఆ సంఖ్య అరడజనుకైనా మించదు. హోదాకు జెల్లకొట్టి రెండేళ్ల తర్వాత ప్యాకేజీ ఇస్తామని చావుకబురు చల్లగా చెప్పిన కేంద్రం.... అటు చూస్తే పార్టీ నేతలపై అవినీతి మరకలు. పెద్ద నేతలందరికీ సన్‌స్ట్రోక్స్. ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నా ఆ వేగం అందుకోలేని ఆయన కార్యాలయం. ఈ పరిస్థితిలో ఏ పాలకుడన్నా కాడికింద పడేసి దేవుడిపై భారం వేయాల్సిందే. కానీ, చంద్రబాబునాయుడు ఆ పని చేయకుండా ఆశలతో కొత్త అవకాశాలు సృష్టించుకుంటూ రెండున్నరేళ్లు పూర్తి చేశారు. ఈ రెండున్నరేళ్లపాలనలో సంక్షేమ పథకాలతో జనం దగ్గర సగం మార్కులు వేయించుకున్నా, సమస్యల పరిష్కారంలో కూడా సగమే ఫలితాలు సాధించిన బాబు పరిపాలన, పార్టీ పరిస్థితి కష్టసుఖాల సమ్మిళితంగా సాగుతోంది.