తెలంగాణ

మీరే బాధ్యులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: పెద్ద నోట్లు రద్దు చేసి 28 రోజులు గడిచినప్పటికీ బ్యాంకుల వద్ద క్యూలైన్లు మాత్రం తగ్గడం లేదని, వారంలో బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితి తీసుకురావాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, మందుల పెట్టుబడుల కోసం రైతులు నేరుగా రూ.24 వేలు డ్రా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని మంత్రి ఈటెల బ్యాంకర్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని, ఇకనుంచి ప్రతి రోజు లావాదేవీలను ఆర్థిక శాఖ అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పెద్ద నోట్ల ప్రభావం, నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో కలిసి సచివాలయంలో బుధవారం బ్యాంకర్లతో చర్చించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రానికి ఇప్పటి వరకు ఆర్బీఐ రూ.15,583 కోట్లు విడుదల చేసిందన్నారు. అయితే ఇందులో 94.07 శాతం రూ. 2 వేల నోట్లు కావడం వల్ల చిల్లర దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ డినామినేషన్ కలిగిన నోట్లను ఎక్కువ విడుదలయ్యేలా చేస్తే ప్రజల ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి సూచించారు. పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంకులు, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్‌పై కొంత అవగాహన ఉంటుందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం బ్యాంకుల మొహం చూడని వారు కూడా ఉంటారని మంత్రి గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలపైనే బ్యాంకర్లు ఎక్కువ దృష్టిసారించాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పోవాలంటే ఎక్కువ డబ్బు పంపిణీ జరగాలని, తక్కువ డినామినేషన్స్ కలిగిన నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకర్లకు సూచించారు. స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఏటిఎంల సంఖ్య పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. నగదు రహిత విధానంపై ప్రజలలో పూర్తి అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి కోరారు. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలు బ్యాంకులలో ఖాతాలు కలిగి ఉన్నారని, వీరిలో 70 లక్షల మంది రూపే కార్డులను తీసుకున్నప్పటికీ 46 లక్షల మంది తమ ఖాతాలను ఆక్టివేట్ చేసుకోలేదని మంత్రి వివరించారు. ప్రజలకు నగదు రహిత విధానంపై బ్యాంకర్లు, ప్రభుత్వం సంయుక్తంగా అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

చిత్రం... ప్రజల నగదు కష్టాలపై బ్యాంకర్లతో చర్చిస్తున్న ఆర్థిక మంత్రి ఈటల