రాష్ట్రీయం

తేలని 1998 డిఎస్సీ అభ్యర్థుల భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: దాదాపు 18 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 1998 డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూ చుక్కలు చూపిస్తోంది. 1998లో అర్హుల జాబితాను ప్రకటించి ఖాళీలు లేవనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని అప్పటి ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది. అప్పటి నుండి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వాలకూ, అధికారులకు పట్టడం లేదు. అనేక మార్లు దీక్షలు చేసినపుడు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే తప్ప నియామకాలకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను పిలిచి ముందు 1998 డిఎస్సీ అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఖాళీలను భర్తీ చేయమని ఆదేశించడంతో ఆశలు రేకెత్తినా అది కూడా నేటి వరకూ నెరవేరకపోవడంతో తాజాగా వారంతా కార్డుల ఉద్యమం చేపట్టారు. 9వ తేదీ నుండి 17వ తేదీ వరకూ పోస్టు కార్డుల అభ్యర్ధన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు డిఎస్సీ సాధన సమితి నేతలు కె శ్రీనివాస్, బి రఘురామరాజు తెలిపారు. ఆలస్యం కావడంతో అభ్యర్ధులు తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురవుతున్నారని నేరుగా వారు తమ గోడు చెప్పుకునేందుకు మార్గం లేకపోవడంతో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టామని వారు వివరించారు.