జాతీయ వార్తలు

విశాఖ విమానాశ్రయంలో రూ.57 లక్షల విలువైన బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీల్లో భాగంగా ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.56.88 లక్షల విలువైన 1.966 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు హైదరాబాద్, మరో వ్యక్తి దుబాయి నుంచి వస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ ఎయిర్ ఇంటిజిలెన్స్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రయాణికులను తనిఖీలు చేస్తుండగా సిల్వర్ రంగు కోటింగ్ వేసిన బంగారాన్ని వీరు ధరించిన షూల్లో దాచిపెట్టారు. అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీలు నిర్వహించడంతో అసలు గట్టు రట్టయింది. వీరి నుంచి 1.996 కిలోల బంగారాన్ని స్వాధీనపర్చుకుని కేసులు నమోదు చేశారు. బంగారం స్మగ్లింగ్ కింద కేసు విచారణ జరుపుతున్నారు. దుబాయిలో కొనుగోలు చేసిన బంగారాన్ని విశాఖకు తీసుకువస్తుండగా జరిగిన ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరగడంతో కస్టమ్ అధికారులు అప్రమత్తమయ్యారు.