రాష్ట్రీయం

అసెంబ్లీపై వ్యూహం మంత్రుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8:ఈనెల 16నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రుల వ్యూహ కమిటీ గురువారం సమావేశం అయింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు సమావేశం అయ్యారు. 16 నుంచి జరిగే సమావేశాల్లో విపక్షాలు ఏయే అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందో చర్చించారు. రెండున్నర ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని సమావేశంలో వివరించాలని నిర్ణయించారు. నోట్ల రద్దు తరువాత తలెత్తిన పరిణామాల గురించి విపక్షాలు చర్చకు పట్టుపట్టే అవకాశం ఉన్నందున ఈ అంశంపై ప్రభుత్వం ఏం చేసిందో సమావేశంలో వివరించాలని నిర్ణయించారు.