రాష్ట్రీయం

రైస్‌పుల్లింగ్ కాయిన్ మహత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్లు ఉన్నట్టు ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు రైస్‌పుల్లింగ్ కాయిన్‌ను కనుగొన్నారు. లక్ష్మణ్‌రావు వద్ద కేవలం రూ. 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో అతని ఇంటితోపాటు ఇద్దరు కొడుకులు, కోడళ్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఐటి అధికారులు గురువారం లక్ష్మణ్‌రావు బోగస్ నల్లధనం ప్రకటనపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. లక్ష్మణ్‌రావును కర్నాటకకు చెందిన బాబు అనే వ్యక్తి బురిడి కొట్టించాడు. రైస్ పుల్లింగ్ కాయిన్‌కు పూజలు చేస్తే ఇంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చిపడతాయని కర్నాటక బాబు లక్ష్మణ్‌రావును నమ్మించాడు. దాంతో ఆయన రైస్‌పుల్లింగ్‌కు పూజలు నిర్వహించారు. తాను చేసిన పూజల ఫలితంగా కోట్లాది రూపాయలు వస్తే ఇబ్బంది అవుతుందని భావించి ముందే ఇన్‌కమ్ డిక్లరేషన్ చేసినట్టు లక్ష్మణ్‌రావు ఐటి అధికారుల విచారణలో తెలిపారు. మహారాష్టక్రు చెందిన షౌకత్ అనే వ్యక్తి కర్నాటక బాబును లక్ష్మణ్‌రావుకు పరిచయం చేశాడు. రైస్ పుల్లింగ్ కాయిన్ కోసం లక్ష్మణ్‌రావు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసినట్టు తెలిసింది. ఇదిలావుండగా ఐడిఎస్ పథకం కింద రూ. 9800 కోట్లు బోగస్ నల్లధనం వెల్లడించిన ఫిల్మ్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్‌రావుపై చర్యలకు ఐటి శాఖ సిద్ధమైంది. ఐటి అధికారులు సెక్షన్ 277 ప్రకారం లక్ష్మణ్‌రావుపై చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెప్పారు. నేరం రుజువైతే లక్ష్మణ్‌రావుకు మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఐటి వర్గాలు తెలిపాయి.