జాతీయ వార్తలు

ఆశాపరేఖ్‌కు పద్మభూషణ్ కావాలిట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, జనవరి 3: అలనాటి ప్రముఖ హిందీ నటి ఆశాపరేఖ్ పద్మ భూషణ్ అవార్డుకోసం తహతహలాడుతున్నారా? ఈ అవార్డు కోసం పెద్దయెత్తున ఆమె లాబీయింగ్ చేస్తున్నారా? కేంద్ర రవాణా శాఖ మంత్రి, ప్రధాని మోదీకి కుడి భుజమూ అయిన నితిన్ గడ్కరీ మాటలను బట్టి ఇది నిజమే అనుకోవాలి. నాగపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ అవార్డుల ఎంపికనేది తలనొప్పి వ్యవహారంగా మారిందన్నారు. పద్మ అవార్డులకోసం చాలామంది సిఫార్సు లేఖలు చేతబట్టుకుని తనను వెన్నాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఒకప్పటి బాలీవుడ్ నటి ఆశాపరేఖ్ కూడా ఇందుకు అతీతం కాదన్నారు. పద్మ భూషణ్ అవార్డు తనకు ఇప్పించవలసిందిగా ఆశా ఏకంగా తన ఇంటికే వచ్చి మనసులో మాట చెప్పుకున్నారని, ఆ సమయంలో తమ అపార్ట్‌మెంట్ లిఫ్టు పనిచేయడం లేదని, దాంతో ఆశా పనె్నండు ఫోర్లు ఎక్కి వచ్చి తనను కలవడం ఆశ్చర్య పరిచిందని గడ్కరీ చెప్పారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తాను చేసిన సేవల దృష్ట్యా పద్మ భూషణ్ అవార్డుకు అర్హురాలినేనని కూడా ఆమె చెప్పుకున్నారని గడ్కరీ తెలిపారు. అరవై, డభ్బై దశకాల్లో అనేక చిత్రాల్లో నటించిన ఆశాపరేఖ్‌ను 1992లోనే పద్మశ్రీ అవార్డు వరించింది. 2014 లో ఆమెకు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు కూడా దక్కింది.

నేడు బర్దన్
అంత్యక్రియలు
న్యూఢిల్లీ, జనవరి 3: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి.బర్దన్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంచుతామని, సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ సీనియర్ నాయకుడొకరు ఆదివారం వెల్లడించారు. చాలా కాలం నుంచి అస్వస్థతతో బాధపడుతున్న బర్దన్ శనివారం రాత్రి న్యూఢిల్లీలోని జిబి.పంత్ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. స్థానిక విద్యుత్ స్మశానవాటికలో సోమవారం సాయంత్రం 3 గంలకు బర్దన్ అంత్యక్రియలు జరుగుతాయని, అంతకుముందు ఆయన భౌతికాయాన్ని వామపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం సిపిఐ ప్రధాన కార్యాలయం ‘అజయ్ భవన్’లో ఉంచడం జరుగుతుందని పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా వివరించారు.