రాష్ట్రీయం

ఆరోగ్యశ్రీ పడకేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 9: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, గృహనిర్మాణం లాంటి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని, ఆయన మెడలు వంచైనా ఆ పథకాలు అమలు చేయిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న భారీ ధర్నాల్లో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం తీవ్రస్ధాయిలో ఉద్యమిస్తామని, చంద్రబాబుకు బుద్ధి వచ్చేంతవరకు గడ్డిపెడుతూనే ఉంటామని ఆయన అన్నారు. వైఎస్ కంటే ముందు పాలించిన కొంతమంది నాయకులు పేదలు, బిసిలపై కపట ప్రేమ చూపించారన్నారు. కాని వైఎస్ మాత్రం పేదల జీవితం బాగుపడాలని, పేదల కుటుంబాలు అప్పుల పాలుకాకుండా వారి పిల్లలలను ఇంజనీరింగ్, వైద్యవిద్యను అందించి రాష్ట్రంలో మంచి పరిపాలనను అందించారని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీని నడిపించే నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఎనిమిదినెలలనుండి నగదు ఇవ్వలేదని దీంతో ఈ పథకం నిర్వీర్యమైందని ఆయన ధ్వజమెత్తారు. ఆసుపత్రులకు నగదు ఇవ్వకుండా రోగులకు ఏవిధంగా వైద్యం అందిస్తారనే విషయం చంద్రబాబుకు తెలియదా అని జగన్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి 910కోట్లరూపాయలు ఈ సంవత్సరానికి ఖర్చు అవుతుందని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తెలియచేస్తే 565కోట్లరూపాయలను కేటాయించటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తాను రాష్టవ్య్రాప్తంగా ఆరోగ్యశ్రీ పథకానికి ధర్నాలు చేస్తామంటే 260 కోట్ల రూపాయలను చంద్రబాబు విడుదల చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్ హయాంలో 108కు ఫోన్ చేస్తే వెంటనే కుయ్ కుయ్‌మని అంబులెన్స్‌లు వచ్చి రోగులను తీసుకువెళ్ళాయని కాని నేడు అలాంటి పరిస్ధితులు లేవని ఆయన ఆరోపించారు. తాను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిన సమయంలో అక్కడ ఐటిడిఎ పరిధిలో పది అంబులెన్స్‌లు ఉన్నాయని వాటిలో కేవలం మూడుమాత్రమే పనిచేస్తున్నాయని ఈవిధంగా ఉంటే ఆరోగ్యశ్రీ పథకం ఏవిధంగా అమలవుతుందని ఆయన ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ పథకంలో వైఎస్ హయంలో నిర్ణయించిన ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈవిధంగా ఉండటం వల్ల కార్పొరేట్ వైద్యులు ఆందోళన చెందుతున్నారని ఈధరలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 133 రోగాలను కార్పొరేట్ ఆసుపత్రులనుండి తీసివేసి ప్రభుత్వ వైద్యశాలలకు పరిమితం చేశారని, కాని అక్కడ తగిన సదుపాయాలు, సూపర్ స్పెషాలిటి సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఆరోపించారు. తాను స్వయంగా కలెక్టర్‌కు అర్జీ ఇవ్వాలని అనుకున్నానని , తాను వస్తున్న విషయాన్ని ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్‌కు ఫోన్‌చేసి చెప్పటంతో కలెక్టర్ వెళ్లిపోయారని చెప్పారు.

చిత్రం..ఒంగోలులో జరిగిన ధర్నాలో ప్రసంగిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్