రాష్ట్రీయం

అమెరికా అమ్మ ఒడికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 9: కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అంటాడో సినీ కవి. ఆ మాటను ఓ విదేశీ అమ్మ నిజం చేస్తోంది. పేగు తెంచుకుని బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఏ కారణం చేతనో పసిగుడ్డును కుప్పతొట్లో వదిలేస్తే, మాతృదేశానికి ఏమాత్రం సంబంధంలేని మహాతల్లి మాత్రం ఆ బిడ్డను భుజానికెత్తుకుంది. అనాధ అన్న ముద్రపడకముందే అక్కున చేర్చుకోవాలని ఐదు రోజులుగా తపన పడుతోంది. నాలుగు నెలల కిందట ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం టోల్‌ప్లాజా సమీపంలో రోజులునిండని పసిగుడ్డు కుప్పతొట్లో కనిపించింది. సమాచారం అందుకున్న ఆదిలాబాద్ పిల్లల సంరక్షణ కేంద్రం సిబ్బంది, అధికారులు ఆ బిడ్డను చేరదీశారు. శిశువిహార్ కేంద్రానికి చేర్చి నాలుగు నెలలుగా ఆలన పాలన చూస్తున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న పసి ప్రాణి కథ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకున్న అమెరికాలోని ఓ ప్రయివేట్ దత్తత సంస్థ చలించిపోయింది. ఆ దేశానికి చెందిన కెరోల్లాయ్ సి బల్గర్ అనే మహిళకు సమాచారం అందించింది. భారతదేశంపై ఎనలేని అభిమానం కలిగిన కెరోల్లాయ్ తక్షణం కదిలింది. రోజుల వయసున్న చిన్నారిని దత్తత తీసుకొని, నిండు జీవితం అందించాలన్న సంకల్పంతో అమెరికా నుంచి ఆదిలాబాద్‌కు చేరుకుంది. గత 5న తన తల్లితో కలిసి వచ్చిన కెరోల్లాయ్, పసిగుడ్డును తన కుటుంబంలోకి ఆహ్వానించేందుకు తహతహలాడుతోంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే బాలికా సంక్షరణ బాధ్యత భుజానికెత్తుకుంటానని ప్రయత్నాలు చేస్తోంది. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న బాలికకు ఆరోగ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటానని కూడా చెబుతోంది. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. అన్న స్ఫూర్తిని కలిగిస్తూ గత ఐదు రోజులుగా ఎంతో మురిపెంతో చిన్నారిని సాకుతున్న కెరోల్లాయ్‌ని చూసి స్థానికులు మురిసిపోతున్నారు. ప్రభుత్వ లాంఛనాలు పూరె్తైన వెంటనే చిన్నారిని తనవెంట అమెరికాకు తీసుకువెళ్తానని ఆనందంగా చెబుతున్న కెరోల్లాయ్ అభినందనీయురాలే.

చిత్రం..శిశువిహార్ లో చిన్నారిని భుజానికెత్తుకుని మురిసిపోతున్న కెరోల్లాయ్ సి బల్గర్