రాష్ట్రీయం

ఇక సాంకేతిక విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: రాష్ట్రంలో సాంకేతిక విప్లవం రాబోతోందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన అమలు కానుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖల మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విశాఖ శివారు మధురవాడలోని ఐటి కంపెనీల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఐటి పాలసీకి ఆకర్షితులైన 10 దేశాలకు చెందిన, 180 ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటి మంత్రిగా తాను, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తదితరులు ఇటీవల అమెరికా, తదితర దేశాల్లో పర్యటించిన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో తమ కంపెనీలు స్థాపించేందుకు సిద్ధ పడ్డాయన్నారు. విశాఖపట్నం, విజయవాడల్లో కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. విశాఖతో పాటు కాకినాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వివిధ రాష్ట్రాలో అమలవుతున్న ఐటి పాలసీని అధ్యయనం చేసిన మీదట, రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీని అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ-ప్రగతి కార్యక్రమం దేశానికే తమమానికంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 35 శాఖలు, అన్ని కలెక్టరేట్లలో కాగిత రహిత పాలన అమలు చేసేందుకు ఈ-ప్రగతి దోహదం చేస్తోందన్నారు. గ్రామస్థాయిలోని రెవెన్యూ అధికారి మొదలు కొని ఉన్నతాధికారుల వరకూ ట్యాబ్‌లు పంపిణీ చేశామని చెప్పారు. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ఐటి శాఖ ఉన్నతాధికారి విశాఖ వచ్చి ఇక్కడ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారన్నారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఐటి గ్రీవెన్స్‌సెల్, కాల్ సెంటర్లు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. విశాఖ నగరంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి విశేషావకాశాలున్నాయని, ఇక్కడ వౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సైతం విశాఖలో ఐటి పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఐటి శాఖ కార్యదర్శి ఫణి కిషోర్, పలువురు ఐటి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.