జాతీయ వార్తలు

ముందున్నాయ.. మరిన్ని కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీసా (గుజరాత్), డిసెంబర్ 10: కొత్త నోట్ల వల్ల ప్రజలకు రాబోయే కష్టాలు మరింత ఎక్కువగానే ఉండవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తూ, అయితే 50 రోజుల తర్వాత పరిస్థితి క్రమంగా మామూలు స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఈ అంశంపై ప్రతి రోజూ సభా కార్యక్రలాపాలను అడ్డుకొంటున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా దుయ్యబడుతూ లోక్‌సభలో తాను మాట్లాడకుండా అడ్డుకొంటున్న కారణంగా జన సభ (ప్రజల మధ్య)లో మాట్లాడాల్సి వస్తోందన్నారు. ‘ఇది మామూలు నిర్ణయం కాదని నేను మొదటి రోజునుంచీ చెప్తూ ఉన్నాను. దీనిలో చాలా కష్టాలున్నాయి. ఇది చాలా కఠినమైన నిర్ణయం. చాలా కష్టాలు, సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని కూడా చెప్పాను. 50 రోజుల పాటు కష్టాలు ఉంటాయి. అంతేకాదు, ఈ కష్టాలు మరింతగా పెరగవచ్చు కూడా. అయితే 50 రోజుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది. 50 రోజుల తర్వాత పరిస్థితి క్రమంగా మామూలుస్థితికి చేరుకోవడాన్ని మీ ళ్లతో మీరే చూస్తారు’ అని ప్రధాని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి 30 రోజులు గడిచిపోయినప్పటికీ ప్రజలు బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నట్లు, నగదు కొరత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపైనా దాని ప్రభావం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రతిపక్షాలు పార్లమెంటును ప్రతిరోజు అడ్డుకోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబడుతూ చివరికి రాష్టప్రతి కూడా వారి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అయితే లోక్‌సభలో తనకు మాట్లాడడానికి ఎప్పుడు అవకాశమొచ్చినా 125 కోట్ల దేశ ప్రజల వాణిని వినిపించడానికి ప్రయత్నిస్తానని శనివారం ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని అన్నారు. వాళ్ల అబద్ధాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రతిపక్షాలు చర్చనుంచి పారిపోతున్నాయని ఆయన అన్నారు. అంతేకాదు నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసే ధైర్యం కూడా వాళ్లకు లేదని, ఎందుకంటే ప్రజలు కూడా నోట్ల రద్దుకు అనుకూలంగా ఉన్నారని వాళ్లకు తెలుసునని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేయాలని మాత్రమే జనం కోరుతున్నారన్నారు.‘నన్ను విమర్శించండి.. జనం సమస్యలను ఎత్తి చూపండి.. కానీ బ్యాంకులు, ఎటిఎంల ముందు క్యూలో నిలుచున్న జనం కష్టాలను తీర్చడానికి ప్రయత్నించండి. బ్యాకింగ్, నగదు రహిత లావాదేవీలపైన వారికి అవగాహన కల్పించడానికి ప్రయత్నించండి’ అని ఆయన ప్రతిపక్షాలను కోరారు. నోట్ల రద్దుకు ముందు జనం 500, వెయ్యి రూపాయల నోట్లను తప్ప చిన్న నోట్లను ఏమాత్రం గౌరవించే వారు కాదని, అయితే నోట్ల రద్దు తర్వాత వంద రూపాయల నోటుకు ఒక్కసారిగా విలువ పెరిగిపోయిందని, ఇప్పుడు జేబులో వంద రూపాయల నోటున్న వాడే మారాజని మోదీ అన్నారు. అంతకు ముందు ఆయన దీసాలో అమూల్ డైరీ అనుబంధ బనస్ డెయిరీకి చెందిన చీజ్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించారు.
అమ్మ ఆశీస్సులు తీసుకున్న ప్రధాని
ఒక రోజు గుజరాత్ పర్యటనకోసం శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌కు సమీపంలోని రైసాన్ గ్రామంలో ఉంటున్న తల్లి హీరాబెన్‌ను సందర్శించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. బనస్కాంతా జిల్లా దీసా పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం గాంధీనగర్‌లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ సదస్సులో పాల్గొనడానికి ముందు తన సోదరుడు పంకజ్ మోదీ ఇంటికి వెళ్లి తల్లితో 20 నిమిషాల సేపు గడిపారు.

చిత్రం... గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో అమూల్ చీజ్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం సంప్రదాయ దుస్తుల్లో గిరిజన మహిళలతో కలిసి కెమెరాకు పోజు లిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ