రాష్ట్రీయం

కళంకిత సొమ్ము రూ.100 కోట్లుపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలుగు రాష్ట్రాల్లో లంచగొండులు, అక్రమార్జనకు పాల్పడిన అధికారుల నుంచి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) స్వాధీనం చేసుకున్న పెద్ద నోట్లు రూ.100 కోట్లకుపైగా ఉన్నాయి. ఈ సొమ్మునంతా ఈ నెల 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఆ పని పూర్తి చేసేందుకు ఎసిబి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం వీరు హైకోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. కోర్టు అనుమతించిన వెంటనే ఈ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఏసిబి వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుతో పాటు బెయిల్ కోసం న్యాయాధికారులకు లంచం ఇవ్వజూపిన గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్న పెద్ద మొత్తాలను ఇప్పటికే బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు సమాచారం.
సాధారణంగా ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిన వెంటనే ఏసిబి అధికారులు లంచం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న అధికారిని వలపన్ని పట్టుకుంటారు. అలాగే అవినీతిపరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు.
దీనినే కళంకిత సొమ్ము అంటారు. రసాయనిక పరీక్షకు పంపే ఈ నగదును న్యాయస్థాన అనుమతితో కోర్టు రూముల్లో పోలీసు భద్రత మధ్య ఉంచుతారు. నేర నిర్ధారణ కోసం మెటీరియల్ సాక్ష్యంగా ఉపయోగించే ఈ సొమ్మును కోర్టు ఎదుట ప్రదర్శిస్తారు. ఈ నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే సాక్ష్యం తారుమారవుతుందేమోననన్న ఆందోళన అక్కర్లేదని ఎసిబి వర్గాలు అంటున్నాయి. కొన్ని కేసుల్లో ఇటువంటి నగదు ఎన్నో ఏళ్ల తరబడి కోర్టు రూముల్లో మగ్గుతూ ఉంటుంది. సాక్ష్యాలు తారుమారుకాకుండా ఉండేందుకు ఈ నగదును ఫోటో కాపీ చేయడంతో పాటు ల్యాబ్ రిపోర్టులను జతపరిచి సాక్ష్యంగా కోర్టుకు చూపిస్తే సరిపోతుందని ఎసిబి వర్గాలు తెలిపాయి.