రాష్ట్రీయం

వికీపీడియాతో విజ్ఞాన విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: అన్ని భారతీయ భాషల్లో వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని వికీ ట్రైనర్, ఆంగ్ల వికీపీడియన్ టిటో దత్తా పేర్కొన్నారు. వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నాయకత్వ శిక్షణ, వికీపీడియాలో పనికొచ్చే ఉపకరణాల గురించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు భాషాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు విశేషాలు అందించిన వారమవుతామని, దీంతో సరికొత్త విజ్ఞాన విప్లవం వస్తుందని ఆయన పేర్కొన్నారు. వికీపీడియాను అభివృద్ధి చేయడానికి కాలేజీల్లో కార్యశాల, ఫోటోవాక్, ఎడిట్ ఆ థాన్ తదితర కార్యక్రమాలను నిర్వహించవచ్చని చెప్పారు. చరిత్రకారుడు, రచయిత, తెలుగు వికీపీడియన్ కట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ గోల్కొండ వంటి ప్రదేశాల్లో కూడా ప్రజలకు తెలియని చారిత్రక, సాంకేతిక ప్రదేశాలు అంశాలు ఉంటాయని అన్నారు. వాటి ఫోటోలు తీసి వికీమీడియా కామన్స్‌లో చేర్చవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిఐఎస్-ఎ2కె ప్రతినిధి పవన్ సంతోష్, వికీపీడియన్ ప్రణయ్ రాజ్ వంగరి నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు వికీపీడియన్లు కశ్యప్, నాగేశ్వరరావు, మీనా గాయత్రీ, వౌర్య వంటి వారితో పాటు కొత్తగా వికీపీడియాలో చేరిన వారు కూడా పాల్గొన్నారు.