రాష్ట్రీయం

దరఖాస్తు ప్రక్రియలో అనుమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందేహాలు తీర్చే యంత్రాంగం కరవు
పట్టించుకోని కార్పొరేట్ కళాశాలలు
ఆన్‌లైన్ తెచ్చిన తంటా ఇది

హైదరాబాద్, డిసెంబర్ 10: ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు అయోమయంగా తయారయింది. దీనికి తోడు ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు సైతం తమకు లాభం లేని ఈ వ్యవహారంలో తల దూర్చడం ఎందుకన్నట్టు విద్యార్థులను గాలికి వదిలేయడంతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేవలం రిసెప్షనిస్టులకు, క్లర్కులకు మాత్రమే బాధ్యతలు అప్పగించి బోధన సిబ్బంది వౌనంగా ఉండటంతో విద్యార్థులు కాలేజీల యాజమాన్యాలపై ఫిర్యాదు చేస్తున్నారు. దరఖాస్తులో తప్పనిసరి ఆధార్ కార్డు నెంబర్ రాయాలనే నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించేందుకు రాష్ట్రాల వారీ కౌనె్సలింగ్ డెస్క్‌లు లేకపోవడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. అంతా జాతీయ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాల్సి వస్తోంది.
ఫలితంగా తెలుగు అభ్యర్థుల అనుమానాలు నివృత్తి కావడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న అభ్యర్థులకు గతంలో లేని నిబంధనలు వచ్చి పడటంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎమ్సెట్‌లో సైతం వారు ఇదే తరహా ఆన్ లైన్‌లో దరఖాస్తులు భర్తీ చేయాల్సి ఉన్నా, ఇంకా దానికి గడువు ఉండటం, ముందుగా ఈ ఏడాది జెఇఇ మెయిన్స్‌కు దరఖాస్తు చేయాల్సి రావడంతో వారిలో అనుమానాలు నివృత్తి కావడం లేదు. ఆధార్ కార్డులో ఇంటిపేరు పూర్తిగా ఉండి, పదో తరగతి ధ్రువపత్రంలో సంక్షిప్తనామం ఉంటే అలాంటి దరఖాస్తులు అన్నీ రద్దవుతాయనే ప్రచారం కాలేజీల యాజమాన్యాలే చేయడంతో తమ భవితవ్యం ఏమిటో వారికి పాలుపోవడం లేదు. చిన్న చిన్న అనుమానాలను తీర్చేందుకు ఉన్నత విద్యామండలి లేదా జెఎన్‌టియుహెచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తమ సౌకర్యార్థం కౌంటర్లు తెరిచి ఉంటే బావుండేదని అభ్యర్థులు వాపోతున్నారు.
దరఖాస్తు భర్తీలో చిన్న పొరపాటు జరిగినా రానున్న రోజుల్లో ఇబ్బంది ఎదురవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధ్రువపత్రాల్లోని చిరునామా, ఆధార్ కార్డుల్లోని చిరునామా సరిపోకపోవడం, కొంత సమాచారం తేడా వస్తే దరఖాస్తు ఆన్‌లైన్‌లో తరువాతి పేజీకి పోవడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఫొటో స్కానింగ్, సంతకం స్కానింగ్, ఆధార్ కార్డు స్కానింగ్‌లో కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇవన్నీ సరిచేసేలోగా ఐఐటి జెఇఇ మెయిన్స్ వెబ్‌సైట్ ఆగిపోతోందని వారు చెబుతున్నారు.