రాష్ట్రీయం

విద్యార్థుల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 11: రోడ్డు ప్రమాదం కేసులో ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన పంజగుట్టలో రమ్య, పెద్దఅంబర్‌పేటలో తల్లీ,కూతుళ్లు శ్రీదేవి, సంజన ఘటనలను మరవకముందే కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని బాచుపల్లిలో ఆదివారం మరో దారుణం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు స్కార్పియో నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటన కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మైనర్ విద్యార్థుల ఘాతుకానికి ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో ఓ మహిళ పరిస్తితి విషమంగా ఉంది. కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాచుపల్లి మండలం, ప్రగతినగర్, నిజాంపేటకు చెందిన విద్యార్థులు మిథులానగర్‌లో పదోతరగతి చదువుతున్న ఫణీంద్రతోపాటు స్నేహితులు సాయి మైకేల్, సాయి తేజ, వౌళి, రాము కలసి ఏపి 29 ఎటి 2799 నంబరు గల స్కార్‌పియో వాహనం పై అతివేగంగా దూసుకువెళ్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా, రావుల పాలెంకు చెందిన నాగేందర్, దేవిలు దంపతులు (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు) ప్రగతినగర్‌లో నివాసముంటున్నారు. ఓ ఇంటి కోసం టిఎస్ 05 ఇఇ 6294 నంబరు గల ద్విచక్ర వాహనంపై వెతుకుతున్నారు. కాగా మిథులానగర్ మెయిన్ రోడ్డుకు వచ్చిన వారిని విద్యార్థులు స్కార్‌పియో వాహనంతో దూసుకువచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో నాగేందర్ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. దేవి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదానికి కారణమైన విద్యార్థులంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కెపిహెచ్‌బి పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..మిథులానగర్‌లో స్కార్పియో వాహనం కింద పడి నుజ్జునుజ్జు అయిన ద్విచక్ర వాహనం