రాష్ట్రీయం

8న ఇసుక టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 3: రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని వచ్చే నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి, ఇసుక విధానంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం అధ్యక్షుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రులు పీతల సుజాత, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కిమిడి మృణాళిని, పల్లె రఘునాథ రెడ్డి, గంటా శ్రీనివాసరావు తదితరులతో నూతన ఇసుక విధానంపై విశాఖ కలెక్టరేట్‌లో ఆదివారం చర్చించారు. అనంతరం యనమల విలేఖరులతో మాట్లాడారు. నిర్మాణ రంగంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక విధానం ఉంటుందన్నారు.
ఇసుక తవ్వకాలకు సంబంధించి ఈ నెల ఎనిమిదోతేదీన టెండర్లను ఆహ్వానించనున్నట్టు పేర్కొన్నారు. ఏడోతేదీన మరోసారి మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమై టెండర్ల ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తుందన్నారు. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలని నిర్ణయించామని తెలిపారు.
క్యూబిక్ మీటర్ ఇసుక గరిష్ఠ ధర రూ.550గా నిర్ణయించినట్టు మంత్రి యనమల చెప్పారు. రవాణా ఛార్జీలు దీనికి అదనమని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలకు ఇసుక తవ్వకాలకు అనుతులిచ్చామని, అయితే, ఈ విధానం వల్ల పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుందన్నారు. గత 16నెలల కాలంలో ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వానికి రూ.850 కోట్లు ఆదాయం సమకూరిందని, గతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం లభించలేదని చెప్పారు. తాజాగా ప్రభుత్వం అమలు చేసే విధానం వల్ల మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఇసుక విధానంలో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు తవ్వకాల్లో అవకతవకలకు పాల్పడితే వారి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
చిల్లర వర్తకంలో బహుళజాతి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు పెద్దఎత్తును పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో చిల్లర వర్తకుల కోసం నూతన విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్న, పెద్ద వ్యాపారులకు యంత్రాంగం నుంచి ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్ఛగా, సులభంగా వ్యాపారం చేసుకునేలా విధివిధానాలుంటాయని పేర్కొన్నారు. వినియోగదారులు, వ్యాపారులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

విలేఖర్లతో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు