రాష్ట్రీయం

రాజుకుంటున్న పర్మిట్ల వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జనవరి 3: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల నడుమ ఆర్టీసీ బస్సుల పర్మిట్ల రగడ చినికి చినికి గాలివానలా తయారైంది. అంతర్రాష్ట్ర పర్మిట్ల కాలపరిమితి మునిగినా రెన్యూవల్ చేసుకోకుండా కెఎస్‌ఆర్‌టిసి బస్సులను నడపడం పసిగట్టిన అనంతపురం ఆర్డీఏ అధికారులు కర్నాటక అధికారులకు సూచించారు. అయితీ దీన్ని అవమానంగా భావించిన కర్నాటక అధికారులను ఆంధ్ర బస్సులను సరిహద్దులో నిలివేస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన ఆర్టీఏ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా కెఎస్‌ఆర్‌టిసి బస్సును తూమకుంట చెక్‌పోస్టు వద్ద ఆపి రికార్డులు పరిశీలించారు. గతంలో పొందిన అంతరాష్ట్ర పర్మిట్ కాలం ముగిసినా రెన్యూవల్ చేసుకోకుండా ఆంధ్రా ప్రాంతంలో బస్సు తిప్పడాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై కెఎస్‌ఆర్‌టిసి అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కర్నాటక ఆర్టీఏ అధికారులు చిక్కబళ్ళాపురం వద్ద అనంతపురం, కడప, కర్నూలు, హిందూపురం తదితర డిపోలకు చెందిన బస్సులను తనిఖీ చేసి ఎనిమిది బస్సులను అక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో హిందూపురం ఆర్టీఏ అధికారులు గత నెల 27న కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన కొడికొండ , తూమకుంట చెక్‌పోస్టుల వద్ద నాలుగు కర్నాటక బస్సులను సీజ్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సమస్య తీవ్రం కాకుండా ఉండేందుకు హిందూపురం ఆర్టీసీ డిఎం గోపీనాథ్ కర్నాటక ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. అయినప్పటికీ కర్నాటక ఆర్టీఏ అధికారులు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ బస్సుల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో అధికారులు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా అంతర్రాష్ట్ర పర్మిట్ల పేర అటు కర్నాటక ఇటు ఆంధ్రా రవాణాశాఖ అధికారులు ఎక్కడికక్కడే బస్సులు సీజ్ చేస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు.