రాష్ట్రీయం

స్కిల్ ఇండియాతో 5కోట్ల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా త్వరలో 5కోట్ల మందికి ఉద్యోగాలు కల్లించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో లక్ష మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. ఆలిండియా ఇఎస్‌ఐసి బోర్డు సభ్యుడు కపిలవాయి దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ నిజాం పిజి లా కాలేజ్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళా-2016 ను బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. దత్తాత్రేయతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, విద్యావేత్త చుక్కా రామయ్య, లా కాలేజ్ ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్, బిజెపి నాయకులు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ స్కిల్ ఇండియాలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం రూ.196 కోట్లు కేటాయించామన్నారు. ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని ఆకాంక్షించారు. ఈసందర్భగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉద్యోగాలను కల్పించటం తన బాద్యత అన్నారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెగా జాబ్‌మేళా-2016కు యువకులు, నిరుద్యోగులు వేలాదిగా తరలివచ్చారు.