రాష్ట్రీయం

సంక్రాంతి నుంచీ ఫైబర్‌గ్రిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: ఇప్పటికే వివిధ వర్గాల సంక్షేమం పేరుతో వారికి చేరువవుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి యువకులకు చేరువయ్యే బృహత్తర పథకానికి తెరలేపనుంది. లక్షలాదిమంది యువతీ యువకులకు నిత్యావసరంగా మారిన ఇంటర్నెట్ సేవలను కారుచౌకగా అందించడం ద్వారా, వారి మనసు గెలుచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏపి ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశలో సుమారు లక్ష కుటుంబాలకు కారుచౌకగా ఇంటర్నెట్, కేబుల్‌టివి, టెలిఫోన్ సేవలందించడం ద్వారా యువత, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను మెప్పించనుంది. దీనికోసం ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గత కొద్దినెలల నుంచి టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో జరుపుతున్న చర్చలు ఫలించాయి. సంక్రాంతి నుంచి రాష్ట్రంలోని లక్ష కుటుంబాలు కేవలం 149 రూపాయలకే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీ సౌకర్యం పొందనున్నారు. ప్రస్తుతం వినియోగదారుడు కేబుల్ టివికి 150 నుంచి 200 రూపాయల వరకూ చెల్లిస్తున్నారు. అయితే కేబుల్ టివితో టెలిఫోన్, ఇంటర్నెట్ కూడా జోడించి 149 రూపాయలకే అందించడం ద్వారా రాష్ట్రంలోని యువత, సామాన్య-మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకోవచ్చని బాబు భావించారు. ఆ మేరకు ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ఎయిర్‌టెల్, వోడా వంటి ప్రైవేటు కంపెనీ ఆపరేటర్లతోనూ చర్చలు జరిపారు. ఉచిత ఔట్ గోయింగ్‌కాల్స్‌ను దీనిలో చేర్చాలన్న బాబు ప్రయత్నంపై ప్రైవేటు ఆపరేటర్లనుంచి తొలుత కొన్ని అభ్యంతరాలు వచ్చినా తర్వాత దానినీ ఆమోదించటంతో, బాబు కలలుకన్న ఈ ప్రాజెక్టు సంక్రాంతి నుంచి ఆచరణలోకి రానుంది. తొలిదశలో లక్ష కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసి, తర్వాత దశలవారీగా మిగిలిన కుటుంబాలకు అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేబుల్, నెట్ సేవలకు 10లక్షల ఐపి-టివి, నెట్ మోడెమ్ కోసం విదేశీ కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకుంటోంది. అందులో భాగంగా ఈనెల 25 కల్లా లక్ష పరికరాలు రానున్నాయి. దానితోపాటు కేబుల్ టీవీల నుంచి పే-చానెళ్ల ద్వారా 230 చానెళ్లు, 30 లోకల్ చానెళ్లు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐటి శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ పథకం ప్రధానంగా యువత కోసమే అమలుచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఓటుహక్కు ఉన్న యువతతోపాటు, మరో రెండేళ్ల తర్వాత ఓటుహక్కు పొందనున్న ప్రతి యువత ప్రస్తుతం ఇంటర్నెట్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. అందుకు వారు ఒక్కొక్కరు సగటున 500 రూపాయలు వివిధ స్కీముల్లో ఉన్న నెట్‌ను వినియోగించుకుంటున్నారు. 80 శాతం కాలేజీ యువత వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటే, వాటికి 65 శాతం నెట్ కనెక్షన్లు ఉన్నాయన్నది ఒక అంచనా. అది కూడా వారు వినియోగించే నెట్ సామర్థ్యం కేవలం 5ఎంబిపిఎస్ మాత్రమే. ఏపి ఫైబర్‌గ్రిడ్ పరిధిలోని వివియోగదారులు ఇతర ఆపరేటర్లకు చెందిన ల్యాండ్‌లైన్లకు ఫోన్ చేస్తే నిమిషానికి 50 పైసలు, మొబైల్ ఫోన్ చేసుకుంటే నిమిషానికి రూపాయి వసూలు చేయాలని నిర్ణయించారు.