రాష్ట్రీయం

ఖరీఫ్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: వచ్చే ఖరీఫ్‌నాటికి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని పాలమూరు ఇరిగేషన్ యంత్రాంగాన్ని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాలో ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తి పోతల పథకాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి భూ సేకరణ పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పారు.
యాసంగిలో ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని , వరి పంటల విషయంలో రైతులను ముందుగానే హెచ్చరించాలని చెప్పారు. పనులు జరుగుతున్న ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూప్ ద్వారా తనకు సమాచారం అందించాలని అధికారులకు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి తగ్గట్టు అధికారులు పని చేయాలని అన్నారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఫీల్డ్ ఛానల్స్‌లను తనిఖీ చేయాలని, ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్లు, రప్పలు, ఇతర అడ్డంకులు తొలగించాలని కోరారు. భూ సేకరణ పనుల పురోగతిని ప్రతి వారం సమీక్షించి అప్‌డేట్ చేయాలని కోరారు. నాలుగు ఆన్‌గోయింగ్ పథకాల కోసం ఇంకా నాలుగువేల ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉందని అన్నారు. భూ సేకరణ, అర్ అండ్ ఆర్ పనులు పూర్తయితే ఏడు లక్షల 93వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఐడిసి చైర్మన్ ఈదర శంకర్‌రెడ్డి,ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఎత్తి పోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్‌సిలు మురళీధరరావు, విజయప్రకాశ్, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్ , చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఖరీఫ్ సాగుపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న హరీశ్