రాష్ట్రీయం

‘తాల్’ నేతృత్వంలో లండన్‌లో క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) నేతృత్వంలో లండన్‌లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ అసోసియేషన్ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోంది. లైట్‌హౌజ్‌ఫెలోషిప్ చర్చ్, బెథెల్ మినిస్ట్రీస్ తెలుగు చర్చ్, ఈస్ట్‌హాం బాప్టిస్టి చర్చ్, మేనర్ పార్క్ చర్చ్, విజన్ మినిస్ట్రీస్ చర్చ్, వౌంట్ జియాన్ చర్చ్‌లను ఒక చోటకు ఆహ్వానించి క్రిస్మస్ వేడుకలను నిర్వహించామని తాల్ చైర్మన్ సత్యేంద్ర పగడాల తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రపంచ శాంతికోసం ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌కు చెందిన లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు స్టీవ్ టీమ్స్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారని వివరించారు. సామాజిక వేత్త పాల్ సతినేషన్ కూడా పాల్గొని తాల్ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను శ్లాఘించారని పేర్కొన్నారు.తాల్ ప్రతినిధులు మల్లేష్‌కోట, నిర్మల ధవళ, భారతి కందుకూరి, శ్రీధర్‌మేడిచెట్టి, శ్రీధర్ సోమిశెట్టి పాల్గొన్నారని సత్యేంద్ర పగడాల వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సలోమి, షర్మిల, బ్రదర్ మధుజీ, సిస్టర్ వీణాజీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడు తాము ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశామని, దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు వీక్షించారన్నారు.