రాష్ట్రీయం

ప్రతిష్ఠాత్మకంగా మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫిబ్రవరి 10 నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు దేశ విదేశాల నుండి దాదాపు 9వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అందులో అమెరికా గవర్నర్లు, నోబెల్ గ్రహీతలు, స్పీకర్లు, న్యాయమూర్తులు, ఎన్‌జిఓలు, కార్పొరేట్- సినీరంగ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, కళారంగానికి చెందిన వారు, క్రీడాకారిణులు ఉంటారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు.
అన్ని దశల్లో మహిళలకు సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్వావలంబన సాధించడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. మూడు రోజుల పాటు అనేక మహిళా సాధికారిక అంశాలపై విస్తృత స్థాయి చర్చలు , పోటీలు, ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సోమవారంనాడు హైదరాబాద్ శాసనసభలో ఆయన వివిధ పత్రికల సంపాదకులతో సమావేశమయ్యారు.
వివిధ రంగాల నిపుణులతో మహిళలను చేరువ చేయడం వల్ల అవగాహన పెరుగుతుందని, పౌష్టకాహారం, సామాజిక భద్రత, లైంగిక వేధింపులు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, రక్షిత తాగునీరు, లింగ వివక్ష తదితర అంశాలపై కూడా విస్తృత చర్చ జరుగుతుందని చెప్పారు. మహిళలు తమ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించి ప్రతిభాపాటవాలకు ఉన్న అవకాశాలపై వారికి చైతన్యం కలిగిస్తామని, అన్ని రంగాల్లో నాయకత్వ సత్తా చూపేందుకు వీలుకల్పించడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా ఈ తరహా సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. సదస్సు జరిగే ప్రదేశాన్ని గుర్తించామని, అంతర్జాతీయ ప్రతినిధులకు పూర్తి భద్రత, రక్షణ కల్పిస్తున్నామని అన్నారు.