రాష్ట్రీయం

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల స్కీంపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల విధానం అమలుపై నాలుగు వారాల్లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వతంత్ర రాయ్ అనే వ్యక్తి పిల్‌ను దాఖలు చేశారు. రెండు రాష్ట్రప్రభుత్వాలు మెసర్స్ లింక్ ఆటోటెక్ సంస్థకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లవిధానం అమలు బాధ్యతను అప్పగించారని కోర్టుకు తెలిపారు. అనంతరం నాలుగు వారాల్లో ఈ అంశంపై అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు రెండు రాష్ట్రాలను ఆదేశించింది.