ఆంధ్రప్రదేశ్‌

బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 14: దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక డిజిటల్ రావాదేవీలపై దృష్టి కేంద్రీకరించామని డిజిపి సాంబశివరావు చెప్పారు. ఫిన్‌టెక్ వ్యాలీ వైజాగ్ ఆధ్వర్యంలో బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఒక రోజు వర్క్‌షాప్‌ని నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మొబైల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలు పెరగడం వల్ల, రాష్ట్రంలో సైబర్ నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని, అందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవసరం కూడా ఉందన్నారు. సగటున 100 సైబర్ నేరాలు జరిగితే అందులో 10 కేసుల నమోదు వరకు వస్తున్నాయని, ఇందులో ఒక కేసు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌గా కేసు నమోదవుతుందన్నారు. ఇలాంటి కేసులను సమర్థంగా ఎదుర్కోవడానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా భద్రత కల్పించే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీని అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమంగా నిలుస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డాటా బేస్ ఏర్పాటు కానుందని, దాంతో హాకర్స్‌ని కూడా సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ పోలీస్ శాఖకి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీపై చాలా మందికి అవగాహన లేదని, దానిపై అవగాహనకు ఇలాంటి వర్క్‌షాప్స్ ఉపయోగపడుతాయని తెలిపారు. రాష్ట్రంలో 75 వేల మంది పోలీస్ ఫోర్స్ ఉందని, వారిలో డిజిటల్ లిటరసీ పెరిగే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి హాకర్స్ ఒక సవాలుగా మారుతున్నారని, వారికి అడ్డుకట్ట వేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. సివిల్ సప్లయ్ కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లడుతూ రాష్ట్రంలో 10 శాతం మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, దీన్ని 60 శాతంగా పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆసియాలోనే ఇలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీని మొదటిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఫిన్‌టెక్ టెక్నాలజీ వ్యాలీగా వైజాగ్‌ని కేంద్రంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటి సలహాదారుగా పనిచేస్తున్న జెఎ చౌదరి తెలిపారు. ్ర కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, ఐబిఎం ప్రతినిధి ప్రవీణ్ జయచంద్ర, లా అండ్ ఆర్డర్ ఐజి హరీష్ గుప్తా, ఐబియం ప్రతినిథి సౌమ్యా చౌదరి, రాష్ట్రంలోని వివిధ పోలీస్ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయాల్లో లైబ్రరీలు
అన్ని పోలీసు కేంద్ర కార్యాలయాల్లో పది లక్షల రూపాయల వ్యయంతో గ్రంథాలయాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని డిజిపి సాంబశివరావు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ‘సురక్ష’ మాస పత్రికను కూడా మార్పులు చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్న కారణంగానే, పత్రిక కాలంతో పాటుగా వర్థిల్లుతోందన్నారు. 1981లో ప్రారంభించిన ఈ పత్రిక, గత 36 సంవత్సరాలుగా పోలీసు శాఖకు, పోలీసు కుటుంబాలకు నిర్విరామంగా విలువైన సమాచారాన్ని అందిస్తూనే వుందన్నారు. సురక్ష మీడియా పోర్టల్‌ను బుధవారం విజయవాడలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సందర్భంగా, డిజిపి మాట్లాడుతూ, సురక్ష మాసపత్రికలో ప్రచురించే అంశాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాలని అన్నారు. ప్రతి జిల్లా పోలీసు సూపరింటెండెంటు ఆయా జిల్లాల్లో జరిగిన మంచి పనులను, ఫోటోలను రాష్ట్ర స్థాయి పోటీ పడేలా కృషి చేయాలని, అలాగే సురక్ష పత్రికలో ఒక ఐటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి, సాంకేతికతను బాగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఐజిపిలు హరీష్ కుమార్ గుప్తా, సునిల్ కుమార్, అమిత్ గార్గ్, మధుసూధన్ రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజి ఎబి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.