రాష్ట్రీయం

విశాఖ తీరంలో ఇండో-రష్యా నౌకాదళ సంయుక్త విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: విశాఖ సాగర తీరంలో ఇండో-రష్యా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇంద్ర 16 పేరిట నిర్వహిస్తున్న ఇండో-రష్యా సంయుక్త నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు రష్యన్ నౌకాదళ అధికారులు, సిబ్బంది విశాఖ చేరుకున్నారు. ఈ నెల 14 నుంచి ఎనిమిది రోజుల పాటు బంగాళాఖాతంలోను, తీరంలోను ఇరు దేశాల యుద్ధ నౌకలు, విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. భారత నౌకాదళం తరపున మిస్సైల్ విధ్వంసక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కమోర్తలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి. నౌకాదళానికి చెందిన పి 8ఐ లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, షార్ట్‌రేంజ్ మారీటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ డోర్నియర్‌లు, అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్ హాక్ శిక్షణ విమానాలు, సమీకృత తరహా హెలికాఫ్టర్లు ఈ సంయుక్త విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి. రష్యన్ ఫెడరేషన్ నేవీ (ఆర్‌ఎఫ్‌ఎన్) తరపున ఫసిఫిక్ ఫ్లీట్ నుంచి యుద్ధ నౌకలు తరలివచ్చాయి. ఆర్‌ఎఫ్‌ఎన్‌కు చెందిన రెండు నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఎనిమిది రోజుల కార్యక్రమం రెండు విడతలుగా జరుగుతుంది. తొలి విడతలో 14 నుంచి 18వరకూ తీరంలోను, 19 నుంచి 21 వరకూ సముద్రంలోను జరుగుతాయన్నారు. విన్యాసాల్లో భాగంగా పలు అంశాలను ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు ఇండో-రష్యా నౌకాదళాలు సంయుక్త విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయ.
chitram...
రష్యన్ నౌకాదళ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న
తూర్పు నౌకాదళం చీఫ్ నేవల్ స్ట్ఫా రియర్ అడ్మిరల్ దాస్ గుప్త