రాష్ట్రీయం

సెజ్‌లకు భూ పందేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ల ఏర్పాటుకు, ఇండస్ట్రియల్ పార్కులు నెలకొల్పేందుకు ఎపిఐఐసికి భారీయెత్తున భూములను బదలాయిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. విశాఖపట్నం, అనంతపురం, కృష్ణ, కడప జిల్లాల్లో సెజ్‌లు, ఇండస్ట్రియల్ పార్కు, ఫుడ్‌పార్క్‌లు నెలకొల్పేందుకు ఎపిఐఐసికి భూమిని బదలాయిస్తూ తీర్మానించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామంలో భూములను ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు, విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో దాదాపు 25 ఎకరాల భూమిని సెజ్ ఏర్పాటుకు ఎపిఐఐసికి బదలాయిస్తూ ఆమోదించింది. విశాఖపట్నం జిల్లా దుప్పిటూరు గ్రామంలో 85.47 ఎకరాల భూమిని ఎకరానికి 12 లక్షల చొప్పున, అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆర్ అనంతపురం గ్రామంలోని 61.56
ఎకరాలను ఎంఎస్‌ఎంఇ పార్కు ఏర్పాటు కోసం, అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో 69.38 ఎకరాల భూమిని కనీస ధరగా ఎకరా రూ. 5 లక్షల చొప్పున, అదే గ్రామంలోని 22.84 ఎకరాలను 1.50 లక్షల కనీస ధర కింద ప్రభుత్వం ఎపిఐఐసికి కేటాయించనుంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలోని 138.98 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు నెలకొల్పేందుకు ఎపిఐఐసికి ఎకరా కనీస ధర రూ.65 వేలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండలో 4.06 ఎకరాల భూమిని కృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్‌కు హాట్‌మిక్స్ ప్లాంట్, స్టోన్‌క్రషర్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు ఎకరా రూ. 5 లక్షల ధరకు కేటాయించింది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని మైలవరం సర్వే నెంబర్ 2.18 ఎకరాల భూమిని టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసం హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌కు అప్పగిస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. అదే జిల్లాలో సెట్టిగుంట గ్రామంలో 44.78 ఎకరాల భూమిని మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు కోసం ఎపిఐఐసికి క్రమబద్ధీకరిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది.
విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ఎకనామిక్ టౌన్‌షిప్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన మంత్రిమండలిలో చర్చకు వచ్చింది. ఇందుకోసం 256 ఎకరాల స్థలాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్‌స్టిట్యూషనల్ కింద భూ వినియోగంలోకి తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది.
విశాఖపట్నంలో బిజెపి కార్యాలయం నిర్మాణానికి చినవాల్తేరులోని సర్వేనెంబర్ 13లో గల 87 సెంట్ల స్థలాన్ని ఏడాదికి ఎకరా రూ. 1000 చొప్పున 33 ఏళ్లపాటు లీజుకు అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రప్రభుత్వ ప్రాయోజిత ఆకర్షణీయ నగరాల పథకం కింద రాష్ట్రంలో 5 స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది. దీని కింద కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం తదితర నగరాలను ఎంపికచేసింది. ఇలాఉండగా గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం కింద 12 వేల కంటే తక్కువ జీతం ఉన్న వారికి 15 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 5,038 మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. ఈ కారణంగా ప్రభుత్వంపై 8,79,49,545 రూపాయల భారం పడనుంది.
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలనీల్లో సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 3 కోట్లు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పట్టణ స్థానిక సంస్థలలో పనిచేస్తున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ను క్రమబద్దీకరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అగ్రిగోల్డు ఆస్తుల వేలానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. కృష్ణాజిల్లా కీసర వద్దగల 200 కోట్ల విలువగల 341 ఎకరాల స్థలంతో పాటు విజయవాడలోని 13 స్థిరాస్తుల విక్రయం ద్వారా 90 కోట్ల అంచనాతో బహిరంగ వేలానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఈనెల 26వ తేదీలోగా బిడ్‌లకు గడువు విధించారు. 27న వీటిని తెరుస్తారు. కాగా పర్యాటక రంగ అభివృద్ధికి టూరిజం అండ్ కల్చరల్ బోర్డు ఆర్డినెన్స్‌కు బదులు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది.