రాష్ట్రీయం

వ్యూహాలకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలిరోజైన శుక్రవారంనాడే పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టనున్నారు. ఎన్‌డిఏలో తెలంగాణ రాష్ట్ర సమితి భాగస్వామి కాకపోయినా పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం జరిగిన శాసనసభా కార్యకలాపాల సలహా సంఘ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షమైన ఎంఐఎం.. నోట్ల రద్దు అంశంపై చర్చించాలని పట్టుబట్టగా, చర్చ అవసరం లేదని బిజెపి అడ్డుపడింది. చివరకు చర్చ చేపట్టాలని, అదీ తొలిరోజే జరగాలని నిర్ణయించారు. ఈ అంశంపై వాడిగా వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీలో ప్రభుత్వంపై దాడి ఎలా జరపాలన్న అంశంపై కసరత్తు జరిగింది. ఒక దశలో ఏకంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న విషయం చర్చకు వచ్చింది. అయితే దానివల్ల అంతగా ప్రయోజనం ఉండదనీ, కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు మాట్లాడితే, అధికారపక్షం వాళ్లు పదిమంది మాట్లాడతారని సీనియర్ నేతలు నచ్చజెప్పడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి దూకుడు పెంచాలని, మిగిలిన పక్షాలను కలుపుకొని అధికార పక్షంపై దాడి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో వివరించాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల పిఆర్‌సి బకాయిలు, హైదరాబాద్ దుస్థితిపై సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలని సీనియర్లు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, సభలో సత్తా చూపిస్తామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. కెసిఆర్‌కు మాటలు చెప్పడం, కాలం వెళ్లబుచ్చడం అలవాటు అయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయం సైతం ఆలోచిస్తామని అన్నారు. వెల్‌లోకి వెళితే సస్పెండ్ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
చేసింది చెబుదాం: చెప్పింది విందాం
అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా ఉండాలని పార్టీ శాసన సభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు. శుక్రవారం నుంచి జరిగే సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై తాను సభలో ప్రకటన చేయనున్నట్టు చెప్పారు. ఇది కేంద్రానికి సంబంధించిన అంశం, నోట్ల రద్దుకు మనం మద్దతు ఇస్తున్నాం, అయితే కరెన్సీ రద్దుతో తలెత్తిన పరిణామాలను సభ ముందు ఉంచుదామని కెసిఆర్ చెప్పారు. సుదీర్ఘ ఉపన్యాసాలు కాదు, స్పష్టంగా, సూటిగా మాట్లాడడం అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసింది చెబుదాం, నిర్మాణాత్మక మైన సలహాలు వస్తే స్వీకరిద్దామని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం పరిస్థితి, ఇప్పటి పరిస్థితిని సూటిగా సభలో వివరించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సూచించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి సభలో వివరించన్నుట్టు చెప్పారు. ప్రాజెక్టుల పై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నట్టు టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశంలో కెసిఆర్ వివరించారు.
నిలదీస్తాం: బిజెపి
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అధికారపక్షాన్ని నిలదీస్తామని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బిఎసి సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చకు 20 రోజులపాటు అసెంబ్లీ నిర్వహించాలని కిషన్‌రెడ్డి అన్నారు. రైతులకు పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, రుణమాఫీ, వడ్డీ మాఫీ, కరవు పరిస్థితులు వంటి ఎన్నో సమస్యలున్నాయని పేర్కొన్నారు.
కాగా అరాచకాలు సృష్టించవద్దని, పోడియం దాటవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడం విడ్డూరమని, ప్రజాసమస్యలను లేవనెత్తినపుడు వాటిని అధికారపక్షం విని పరిష్కరిస్తే పోడియం వద్దకు పోవలసిన అవసరం ఏమిటని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అధికారపక్షం అడ్డుకోవాలని చూస్తేనే సభలో గొడవ జరిగేందుకు ఆస్కారం కలుగుతుందని అన్నారు.