రాష్ట్రీయం

కాలుష్య నివారణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కాలుష్య సమస్య పెరిగిపోతోందని, కాలుష్యాన్ని అరికట్డడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, కాలుష్య నివారణ అందరి బాధ్యతని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. గురువారం డిజిపి కాన్ఫరెన్స్ హాల్‌లో అశ్వని అలర్జీ కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్వచ్ఛ ఆకాశ్ అభియాన్’ అవగాహన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్‌శర్మ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా కాలుష్య బారిన పడుతున్న వారిలో అత్యధికులు పోలీసులేనని, ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు వివిధ రోగాల బారిన పడుతున్నారన్నారు. స్వచ్ఛ వాయువు ప్రచారోద్యమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఈ కార్యక్రమంలో పోలీసులు సైతం పాల్గొంటారన్నారు. అశ్వని అలర్జీ కేంద్రం చేపట్టిన ఈ మహోద్యమంలో భాగంగా నగరవ్యాప్తంగా 20 ప్రాంతాల నుంచి సేకరించిన కాలుష్యాన్ని శాస్ర్తియంగా పరిశోధించడాన్ని ఆయన అభినందించారు. మదీనా, ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో అత్యధికం, చార్మినార్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లలో అత్యల్ప శాతం కాలుష్యం నమోదైనట్టు కాలుష్య శాస్తవ్రేత్తలు గుర్తించడం జరిగిందన్నారు. ఒకే ప్రాంతంలో కొంత దూరంలోనే ఎక్కువ, తక్కువ శాతం కాలుష్యం నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు.
అశ్వనీ అలర్జీ కేంద్రం (హిమాయత్‌నగర్) సారథి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ, పెరిగిపోతున్న కాలుష్యంపై నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలుష్య డేటాను సేకరించి, పరిశీలించగా చిక్కడపల్లి, మదీనా చౌరస్తాలో కాలుష్య శాతం మరీ ఎక్కువగా ఉందని, అదే సమీప ప్రాంతమైన చార్మినార్ వద్ద చాలా తక్కువగా కాలుష్యం నమోదై ఉందన్నారు. దీనికి కారణం ఆయా పరిసరాల్లోని దుమ్ము, ధూళియేనన్నారు. దీని ద్వారా ఆస్తమా, శ్వాసకోశ, చర్మం, కంటి సమస్యల వ్యాధులు వ్యాపిస్తున్నాయని డాక్టర్ నాగేశ్వర్ అన్నారు. కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి త్వరలో అశ్వనీ అలర్జీ కేంద్రం వైద్యుల బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కాలుష్య నివారణకు తగు సూచనలు చేయనున్నట్టు డాక్టర్ నాగేశ్వర్ తెలిపారు. కాలుష్యంపై శాస్ర్తియమైన పారామీటర్లు ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ ఆకాశ్ అభియాన్ పేరుతో ప్రతి పదిహేను రోజులకోసారి డేటాను విడుదల చేస్తామని తెలిపారు. చౌరస్తాల్లోని సిగ్నళ్ల వద్ద డీజిల్ వాహనాలు వెదజల్లే కాలుష్యంతో రోగాలు ప్రబలే అవకాశం ఉందని, కాబట్టి రెండు, మూడు నిముషాలపాటు ఇంజన్ ఆఫ్ చేసుకోవాలని, వ్యవసాయ సంబంధమైన చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగ ప్రమాదకరమని సూచించారు. భారీ వాహనాలు, ఆటోల పొగను నివారించేందుకు బిస్-3 అనే పాత పద్ధతిలో కాకుండా, బిఎస్-4 అనే నూతన పద్ధతిని పాటించాలని, పొగను విపరీతంగా విరజిమ్మే వాహనాలను నియంత్రించాలని, మెట్రో పనుల సందర్భంగా వెదజల్లే దుమ్ముకు ముందుకు నీళ్లు చల్లే చర్యలను చేపట్టాలని డాక్టర్ నాగేశ్వర్ సూచించారు.

చిత్రం..హైదరాబాద్‌లో నమోదైన కాలుష్య డేటాను విడుదల చేస్తున్న
డిజిపి అనురాగ్‌శర్మ, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్