రాష్ట్రీయం

ప్రైవేటు వర్శిటీలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీలను తీసుకురావద్దని తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ (టిజాక్) డిమాండ్ చేసింది. టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రైవేట్ యూనివర్శిటీలు వస్తే వాటిల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉండదన్నారు. ప్రైవేట్ యూనివర్శిటీలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న యూనివర్శిటీలను బలోపేతం చేయాలని వారు కోరారు. ఈ అంశంపై ఈ నెల 19న అన్ని రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. భూసేకరణకు సంబంధించి పరిశీలించేందుకు పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. భూసేకరణ చట్టంపై కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ నెల 24న టిజాక్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు కోదండరాం, రవీందర్ తెలిపారు. ఈ నెల 20 వరకు అన్ని జిల్లాల్లో జాక్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆవిర్భావం రోజు రాష్ట్ర కమిటీ కార్యాలయంతో పాటు జిల్లా కమిటీ కార్యాలయాల ఎదుట జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 25న టిజాక్ విస్తృత సమావేశం ఉంటుందని చెప్పారు. శుక్రవారం నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చ అర్థవంతంగా జరగాలని, ప్రజాసమస్యలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.