రాష్ట్రీయం

తెలుగుతల్లి శిల్పకళా సృష్టికర్త శంకర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, డిసెంబర్ 16: తెలుగుతల్లి విగ్రహ శిల్పకళా సృష్టికర్త, వేమూరు వాస్తవ్యులు దేవు శంకర్ గురువారం రాత్రి కన్నుమూశారు. శిల్పరత్న దేవు మహమ్మయాచారి రెండవ కుమారుడు శంకర్. వీరి సంతతి ఆరు తరాలుగా శిల్పకళలో తరిస్తోంది. శంకర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శంకర్ బాల్యం నుండి తండ్రి వద్ద శిల్పకళను అభ్యశించారు. గత 65సంవత్సరాలుగా శిల్పకళలో ప్రావీణ్యత పొందారు. శంకర్ చేతులమీదగా తయారుకాబడిన విగ్రహాలు దేశ, విదేశాలలో ప్రతిష్ఠింపబడ్డాయి. ఆయన తయారుచేసిన విగ్రహాలలో ప్రముఖంగా 1976లో మహబూబ్‌నగర్ జిల్లాలోని తెలుగుతల్లి విగ్రహం అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదగా ఆవిష్కరించబడి సన్మానం పొందారు. ఆ తరువాత 1986లో శంకర్ తయారు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని నాటి ముఖ్యమంత్రి నందమూరి తాకర రామారావు ప్రతిష్ఠించి సత్కరించారు. 1989లో లండన్ ఇండియన్ అసెంబ్లీ హౌస్‌లో డాక్టర్ సర్వేపల్లి రాథాకృష్ణన్ విగ్రహాన్ని ఈయనే తయారుచేశారు. అంతేకాకుండా పార్లమెంటు భవన్‌లోని ముగ్గురు తెలుగు రాజకీయ దిగ్గజాలు ఎన్‌జి రంగా, మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశం పంతులు, ఎన్‌టిఆర్ విగ్రహాలు ఈయన తయారుచేసినవే. అమెరికాలోని పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి, న్యూయార్కు గణపతి దేవాలయం పంచలోహ విగ్రహాలు తయారుచేసింది కూడా ఈయనే. ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారులు వెంకటరామయ్యచారి, నాగమయనారాయణాచారి సైతం తండ్రి బాటలో అలవోకగా శిల్పాలు మలుస్తున్నారు. భార్య సత్యవతి వీరికి సహకరిస్తున్నారు. చక్కర వ్యాధితో కొంతకాలంగా బాధపడుతూ అస్వస్థతతో మృతి చెందారు. స్థానిక ఉప్పుబజారులోని ఆయన స్వగృహంలో ఆయన మృతిదేహానికి పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు పూలమాలలుంచి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఆయన స్వగ్రామైన వేమూరుకు తరలించారు. శనివారం ఉదయం ఆయన మృతదేహాన్ని అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2000 మే 5న నాటి రాష్టప్రతి కెఆర్ నారాయణన్‌చే సత్కారం అందుకున్నారు. ఎన్‌టిఆర్, చంద్రబాబు వంటి రాజకీయ నాయకులచే పలుసత్కారాలు, సన్మానాలు పొందారు. 2015 ఉగాది సందర్భంగా విజయవాడలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కళారత్న బిరుదుతో సత్కారించారు.