రాష్ట్రీయం

గవర్నర్ సంతకం ఫోర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ సీటు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడిన ఘరానా మోసగాడిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన మారంరాజు రాఘవరావు (62) సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురి, భాస్కరరావునగర్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ పరిసరాల పోలీస్ స్టేషన్లలో ఇతనిపై పలు చీటింగ్ కేసులు నమోదైవున్నాయి. తాజాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సిఐడి పోలీసులకు చిక్కాడు. గుంటూరుకు చెందిన సహ నిందితుడు మత్తా రఘువంశీని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా చూపిస్తూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ జారీ చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించాడు. అదేవిధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా కొందరిని రాజ్యసభ సభ్యుడిగా మత్తా రఘువంశీని నామినేట్ చేసినట్టుగా గవర్నర్ ఫోర్జరీ సంతకంతో మూడు డాక్యుమెంట్లు సృష్టించాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో జారీ చేయబడిన నామినేటెడ్ పదవులను ఎందుకు అమలుచేయడం లేదంటూ, సదరు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి శుక్రవారం అందజేశారు. గవర్నర్ జారీ చేసినట్టు అందిన డాక్యుమెంట్లు నకిలీవని, గవర్నర్ సంతకం ఫోర్జరీ జరిగినట్టు అధికారులు గుర్తించి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును దర్యాప్తు జరిపిన సిఐడి గవర్నర్ సంతకం ఫోర్జరీయేనని, సదరు డాక్యుమెంట్లు నకిలీవని తేల్చేశారు. నిందితుడు మారంరాజు రాఘవరావును సిఐడి అధికారులు శనివారం అరెస్టు చేశారు. అతనినుంచి మూడు సెట్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు తెలంగాణ రాష్ట్ర సిఐడి అధికారులు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు రఘువంశీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.