రాష్ట్రీయం

‘దివీస్’తో ప్రజల ప్రాణాలకు ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 17: ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే మందుల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని దివీస్ యాజమాన్యం తక్షణం నిలిపివేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని దానవాయిపేట గ్రామంలో దివీస్ మందుల కంపెనీ నిర్మాణానికి నిరసనగా శనివారం నిర్వహించిన బహిరంగ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివీస్ కంపెనీని తక్షణం ఈ తీర ప్రాంతం నుండి తరలించాలని డిమాండ్ చేశారు. చిన్న, సన్నకారు రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించారని విమర్శించారు. దానవాయిపేట గ్రామాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ దత్తత తీసుకున్నారని గుర్తుచేస్తూ, గ్రామాన్ని దత్తత తీసుకుని కూడా కలెక్టర్.. ప్రజలకు అపకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిపే పోరాటానికి అందరూ అండగా ఉండాలని కోరారు. దివీస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పటిష్ట కార్యాచరణ రూపొందించి, పోరాటాన్ని ఉద్ధృతం చేసి, కర్మాగారం నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఎకరం, రెండెకరాల భూములు కలిగిన రైతులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నారు తప్పితే, భూస్వాములు లేరని, పరిశ్రమ కారణంగా పేద రైతులందరూ రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని, మందుల ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే మత్స్య సంపద నాశనమై మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని రాఘవులు ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీల బతుకులు ఛిద్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాగా, ఇక్కడ తయారయ్యే మందులను విదేశాలకు ఎగుమతి చేస్తారని, మందుల తయారీతో ఈ ప్రాంతమంతా ప్రమాదభరితంగా మారిపోయే ప్రమాదం ఉందన్న రాఘవులు.. మందుల కంపెనీ నుండి వెలువడే రసాయనిక పదార్థాల వలన ఈ ప్రాంతం కాలుష్యంతో నిండిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ నియోజకవర్గానికి చెందినవారేనని, ఆయన వెనుకబడిన వర్గానికి చెందిన వారై ఉండి కూడా అగ్ర వర్గాలకు వంత పాడుతున్నారని విమర్శించారు. దివీస్ కంపెనీపై కొన్ని ప్రశ్నలను జిల్లా మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, కలెక్టర్ అరుణ్‌కుమార్‌లకు సంధించనున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు. పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పోలీసులు కూడా బాధిత ప్రజలు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దొంగలకు ఊడిగం చేస్తున్నారని రాఘవులు దుయ్యబట్టారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు జె వెంకటేశ్వర్లు, కె వీరాంజనేయులు, కామేష్, రాజబాబు, దుర్గాప్రసాద్, ఎస్‌ఇజడ్ వ్యతిరేక పోరాట సమితి నేత చింతా సూర్యనారాయణమూర్తి, సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ తదితరులు పాల్గొన్నారు.