రాష్ట్రీయం

మావోయిస్టు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 18: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. ఎస్పీ కెఎల్ ధృవ్ తెలిపిన వివరాల ప్రకారం... మిర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హక్వా అటవీ ప్రాంతంలోని హల్లూరు వద్ద 199 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ జవాన్లు, మిర్తూరు పోలీసులు సంయుక్తంగా గస్తీ తిరుగుతూ శనివారం హల్లూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. తిరిగి వస్తున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. బలగాల వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. తేరుకున్న బలగాలు వెంటనే ప్రతిఘటించడంతో మావోయిస్టులు పారిపోయారు. సంఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహం, బర్మార్ తుపాకీ లభ్యమయ్యాయి. బలగాలు సురక్షితంగా ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ కెఎల్ ధృవ్ ప్రకటించారు.