రాష్ట్రీయం

ఓఆర్‌ఆర్‌పై మరో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, డిసెంబర్ 18: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. ఆదివారం రాత్రి శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన యువకులు రాహుల్ (21), విఘ్నేష్ (22), హర్మీందర్‌సింగ్ (25), మారియో (20) శామీర్‌పేట పరిసర ప్రాంతా ల్లో పార్టీ చేసుకొని నగరానికి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అతి వేగంగా వస్తూ సాయంత్రం 5.30ల సమయంలో తూంకుంటలోని దొంగల మైసమ్మ ఔటర్ రింగ్ రోడ్డు మలుపువద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో కారు బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో మారేడ్‌పల్లికి చెందిన విఘ్నేష్ జైపూర్‌లోని అమిత్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న ఎసిపి అశోక్‌కుమార్ హుటాహుటిన సంఘటనస్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

చిత్రాలు..