రాష్ట్రీయం

నగదు రహితం.. అరచేతిలో వైకుంఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18:తెలంగాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం అంత సులువుగా జరిగే పని కాదు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో కూడా నూటికి నూరు శాతం నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు. అలాంటిది రాష్ట్రంలో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్న తెలంగాణలో రాష్ట్రాన్ని పూర్తిగా నగదు రహితంగా తీర్చిదిద్దుతామనడం కష్టసాధ్యమే. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు 5 లక్షల కరెన్సీ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ మొత్తం లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించాలంటే 10 లక్షల స్వైపింగ్ మిషన్లు అవసరం అవుతాయని ప్రభుత్వమే లెక్కగట్టింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 78 వేల స్వైపింగ్ మిషన్లు మాత్రమే ఉన్నాయి. పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహించాలంటే మరో 9 లక్షల 28 స్వైపింగ్ మిషన్లు అవసరం అవుతాయి. మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ఒక్కొక్క స్వైపింగ్ మిషన్ ధర 10 వేల రూపాయలు. రాష్ట్రానికి అవసరమైన స్వైపింగ్ మిషన్లు కావాలంటే వాటిపై దాదాపు రూ.1000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం భరించి వీటిని కొనుగోలు చేయగలదా? అనేది ప్రశ్న. మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారిలో 80 శాతం మంది చిరు వ్యాపారులే. రెండు, మూడు వేల రూపాయల పెట్టుబడితో చిరు వ్యాపారాలు నిర్వహించే వారికి సొంతంగా పది వేల రూపాయలు ఖర్చు చేసి స్వైపింగ్ మిషన్లు కొనుగోలు చేసే స్థోమత ఉండదనే చెప్పవచ్చు. ఇలా ఉండగా రాష్ట్రంలో గ్రామాల సంఖ్య 10,859 కాగా, అన్ని బ్యాంకులకు కలిపి ఉన్న బ్రాంచీల సంఖ్య 5332. ఈ లెక్కన రాష్ట్రంలో 50 శాతం గ్రామాలకు బ్యాంకింగ్ సౌకర్యం లేదు. పైగా బ్యాంకుల బ్రాంచీలు 70 శాతం వరకు అర్బన్, సెమి అర్బన్ ప్రాంతాలలోనే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఎటిఎంల సంఖ్య 4605 కాగా ఇందులో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎటిఎంల సంఖ్య కేవలం 1085 మాత్రమే. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా, ఇక రాష్ట్రం మొత్తాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దడం ఎలా సాధ్యం అవుతుందనేది ప్రధానమైన ప్రశ్న. ప్రపంచంలో అత్యధికంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేది బెల్జియం రాజధాని నగరమైన బ్రెసల్స్. ఇక్కడ 86 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతుండగా, అమెరికా, స్వీడన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో జరిగే నగదు రహిత లావాదేవీల శాతం 70 నుంచి 79 శాతం ఉన్నప్పుడు 60 శాతం మాత్రమే అక్షరాస్యత కలిగిన తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా సాధ్యమనేది మిలియన్ డాలర్ ప్రశే్న.