రాష్ట్రీయం

మహిళ ఖాతాలో రూ. 1.86 కోట్లు జమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 18 : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఓ వైపు కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్న బడాబాబుల బండారం బయట పడుతుండగానే, అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతాలోకి ఆదివారం రూ. 1.86 కోట్లు జమ అయింది. ఈ సంఘటన మీడియాలో హల్‌చల్ చేసింది. అందుకు సంబంధించిన వివరాలు.. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులునాయుడు భార్య సుజాతకు తాడిపత్రి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో 055201100018954 నెంబరుతో ఖాతా ఉంది. ఈ ఖాతాలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో రూ. 1.86 కోట్లు జమ అయినట్లు ఆమె సెల్‌ఫోన్ నెంబర్ 9908725119కు సమాచారం వచ్చింది. దీంతో శ్రీనివాసులునాయుడు ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గురయ్యాడు. తమ ఖాతాలో అంత మొత్తం లేదని చెప్పాడు. ఒకవేళ అంత మొత్తం ఉన్నా అది ఎలా వచ్చిందో తెలియదని సుజాత పేర్కొంది. కాగా తొలుత ఖాతాలో నగదు జమ అయినట్లు మొబైల్‌కు సందేశం(మెసేజ్) రాలేదని బుకాయించిన ఆమె ఆ తర్వాత మెసేజ్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే సాయంత్రానికి ఆ మెసేజ్ కనిపించలేదని విలేఖరులకు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ విషయంపై సోమవారం సంబంధిత బ్యాంకు రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.