రాష్ట్రీయం

జస్టిస్ నాగార్జునరెడ్డికి బార్ కౌన్సిళ్ల సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డికి ఆంధ్రా, తెలంగాణ ఇరు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు సంఘీభావం తెలిపాయి. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెండైన న్యాయాధికారి రామకృష్ణ చేసిన అభియోగాలను ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆదివారం సమావేశమైన ఇరు రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్ రేణుక పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ నాగార్జునరెడ్డి కుల వివక్షతతో వ్యవహరిస్తున్నరని న్యాయాధికారి రామకృష్ణ చేసిన అభియోగాలపై రాజ్యసభకు అందిన లేఖను కూడా ఉపసంహరించుకున్నారని వారు తెలిపారు. న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి, గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడడం తగదన్నారు. పైగా ఈ అంశం కోర్టు పరిధిలో విచారణలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగార్జునరెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టాలని వారు కోరారు.