ఆంధ్రప్రదేశ్‌

బ్యాంకుల్లో బాగోతాలపై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: రద్దయిన నోట్లను పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన ఘటనలు, కొన్ని చోట్ల రద్దయిన నోట్లను బ్యాంకర్లకు అక్రమ పద్ధతుల్లో ఇచ్చి రెండు వేల రూపాయల కొత్త కరెన్సీని తీసుకున్న వైనంపై దర్యాప్తు చేయాలని సిబిఐ నిర్ణయించింది. దీని కోసం ఆదాయం పన్ను శాఖ, ఆర్‌బిఐతో పాటు స్ధానిక పోలీసుల సహకారం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది. మరో వైపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని బ్యాంకులు నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల్లో సిసిటివి ఫుటేజిలను పంపాలని ఆయా బ్యాంకు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల రికార్డుల్లో అనుమానాస్పద అకౌంట్లను స్క్రూటినీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రెండు వేల నోట్ల కరెన్సీని తీసుకున్న కేసుల వివరాలు కొన్ని ఆదాయం పన్ను శాఖకు అందాయి. ఈ వివరాలు తమకు పంపాలని కూడా సిబిఐ ఐటి శాఖను కోరింది. ఇంతవరకు రెండు రాష్ట్రాల్లో 15కుపైగా వివిధ కేసుల్లో రద్దయిన నోట్లను ఇచ్చి కమిషన్ ప్రాతిపదికపై రెండు వేల నోట్ల కరెన్సీని తీసుకున్న వ్యక్తులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన రెండు వేల నోట్ల కరెన్సీలో సీరియల్ నంబర్ల వివరాలు ఐటి శాఖ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం సిబిఐకి, ఐటి శాఖకు పెద్ద మొత్తంలో రద్దయిన నోట్ల డిపాజిట్, రెండు వేల కరెన్సీని మార్పిడిలో తీసుకున్న ఘటనలపై ప్రతి రోజూ ఇమెయిల్స్, పోస్టు, టెలిఫోన్ల ద్వారా వివరాలు అందుతున్నాయి. హైదరాబాద్ పోస్ట్ఫాసుల్లోనే ఒక స్కాంలో సిబిఐ పోలీసులు దాడి చేసి రూ. 40 లక్షల విలువైన రెండు వేల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ఫాసు అధికారులు దాదాపు రూ. 4 కోట్ల కొత్త కరెన్సీని రద్దయిన నోట్లను తీసుకుని మార్పిడి చేశారు. ఈ కేసుల్లో పోస్ట్ఫాసు అధికారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆర్‌బిఐ ఇచ్చిన నోటీసులతో బ్యాంకర్లలో అలజడి మొదలైంది. బ్యాంకుల్లో మేనేజర్, క్యాషియర్, లాకర్‌రూం క్యాబిన్లలో అమర్చిన సిసిటివి ఫుటేజిలు ఇవ్వాలని నోటీసుల్లో ఆర్‌బిఐ పేర్కొంది. పైగా కొన్ని చోట్ల రాత్రి పూట కూడా బ్యాంకు షట్టర్లను వేసి అక్రమ లావాదేవీలు జరిగినట్లు సిబిఐ, ఐటి శాఖలకు సమాచారం ఉంది. ఈ ఫుటేజీలను పరిశీలిస్తే కొత్త నోట్ల కరెన్సీ పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి అక్రమంగా కొంతమంది వ్యక్తులకు చేరిన విషయం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో పేరున్న ఒక నగల దుకాణం ద్వారా నవంబర్ 8 రాత్రి భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగాయని, దీనికి సంబంధించిన విలువ కోట్లలో ఉందని సిబిఐకు సమాచారం ఉంది. ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉంది. ఈ కేసులో నగల దుకాణం నిర్వాహకులను విచారించవచ్చని, కాని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. రద్దయిన పెద్ద నోట్లను ఇచ్చి బంగారం బిస్కెట్ల కొనుగోలు పెద్ద ఎత్తున జరిగిందని, వీటి విలువ రూ.2500 కోట్లకుపైగా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఐటి, సిబిఐకు నివేదిక ఇచ్చింది.