రాష్ట్రీయం

ఉద్యోగ విప్లవం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరూ కలసికట్టుగా గళం విప్పాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో మరో ఉద్యోగ విప్లవం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన యువభేరీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన ముఖ్యమంత్రి నేడు ప్లేటు ఫిరాయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయని తద్వారా ఉపాధి అవకాశాలు కలుగతాయని అభిప్రాయపడ్డారు. కాగా, చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీపై వత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని కేంద్రం పునర్విభజన చట్టం సమయంలో పేర్కొనగా, 15 ఏళ్లు ఉండాలని పట్టుబట్టిన చంద్రబాబునాయుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియో టేపులతో ఇరుక్కున్న తరువాత మాటలు మార్చారని మండిపడ్డారు.
కాగా చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో రాజీపడటం, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి విషయంలో విద్యార్థులను మోసం చేయడం వంటి విషయాలపై విద్యార్థులు మండిపడ్డారు. బి.టెక్ పూర్తి చేసిన రోహిత్ అనే విద్యార్థి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అలాచూస్తే ఇప్పటివరకు తనకు రూ.64 వేలు బకాయిపడ్డారని ప్రశ్నించారు. ఈ బకాయిని తాను ఎవరిని అడగాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మరో విద్యార్థి హిమబిందు మాట్లాడుతూ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఒక్క పరిశ్రమనైనా తీసుకు వచ్చారా? అని ప్రశ్నించారు. దీనికి జగన్ బదులిస్తూ వచ్చిరాని ఇంగ్లీషులో మాట్లాడితే పరిశ్రమలు రావని, ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయని బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు తిమ్మారెడ్డి, ఇస్మాయిల్, సత్యనారాయణ, విప్లవ ప్రసాద్ తదితరులతోపాటు వైకాపా నేతలు పాల్గొన్నారు.
బాధితులకు పరామర్శ
యువభేరి అనంతరం వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి బలిజపేట మండలం చిలకపల్లిలో బాధితులను పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్ నానక్‌రాంగుడాలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు.

చిత్రం..యువభేరీలో మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి