రాష్ట్రీయం

పక్క రాష్ట్రాలతో కలసి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 19: పక్క రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, ఒడిశాలతో కలిసి పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, మనోభావాలకు భిన్నంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. భద్రాచలం రామాలయం మునిగిపోతుందని నిపుణులు చెబుతుంటే మునగదంటూ పార్లమెంట్ సాక్షిగా ఒక కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్పడం బాధాకరమన్నారు. రాష్ట్రాల మధ్య వివక్ష పనికిరాదని హితవు పలికారు. జాతీయ హోదా ఇచ్చాక పోలవరం ప్రాజెక్టుపై సర్వే చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, పాత డిజైన్ కాకుండా 153 అడుగులకు కొత్త డిజైన్‌తో ఎలా కడతారని ప్రశ్నించారు. 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఇప్పుడు చెల్లవని, తాజాగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దనోట్ల సమస్యపై పార్లమెంట్ సమావేశాల సమయం వృథా అయ్యిందన్నారు. నల్లధనం కేవలం 12శాతం మంది బడాబాబుల వద్దే ఉంటే 88 శాతం మంది పేదలను ఎందుకు కష్టపెడుతున్నారని సీతారామ్ నాయక్ నిలదీశారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు మానె రామకృష్ణ, యశోద నగేశ్, తిప్పన సిద్ధులు, రత్నం రమాకాంత్, మామిడి పుల్లారావు, బషీర్ పాల్గొన్నారు.