రాష్ట్రీయం

లబ్ధిదారులకే నేరుగా పింఛన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రూరల్), డిసెంబర్ 20: లబ్ధిదారులకే నేరుగా పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడులో మంగళవారం రాత్రి చంద్రన్న కానుకల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాట్లాడుతూ నోట్ల రద్దు తర్వాత పింఛన్ల బట్వాడాలో జాప్యం నివారించేందుకు ఇక బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా నేరుగా పింఛనర్లకే అందజేయాలని నిర్ణయించినట్టు సిఎం వివరించారు. పేదలు ఆనందంగా పండుగ జరుపునేందుకు వీలుగా చంద్రన్న క్రిస్మస్ కానుక అందిస్తున్నామని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి చంద్రన్న సంక్రాంతి కానుక సరఫరా చేస్తామని వివరించారు. ఈ కానుక కింద ఆరు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్ దుకాణాల డీలర్లు, బిసిలుగా (బ్యాంకింగ్ కరస్పాడెంట్)గా వివిధ రకాల పనులు చేసే ప్రక్రియకు నేటి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. చంద్రన్న కానుక కింద రూ.460 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కిట్‌లో 100గ్రా నెయ్యి, పామోలిన్ అర లీటర్, కిలో గోధుమపిండి, అర కిలో శనగనూనె, అరకిలో బెల్లం ఉంటాయన్నారు. రాష్ట్రంలో కోటి 34 లక్షల రేషన్ కార్డులకు రాష్టవ్య్రాప్తంగా చంద్రన్న కానుకలు అందజేయటం జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎంపి నారాయణరావు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..చంద్రన్న క్రిస్మస్ కానుక అందజేస్తున్న చంద్రబాబు