రాష్ట్రీయం

అప్పుడే అణిచేసేవాళ్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ‘తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అక్కడ (కేంద్రం), ఇక్కడ (రాష్ట్రం) మా ప్రభుత్వమే అధికారంలో ఉంది. మిమ్మల్ని (తెరాస) అణచేయాలంటే నిమిషం పట్టేది కాదు. ఇప్పుడనిపిస్తుంది, మేం పొరపాటు చేశామేమోనని అంటూ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో మంగళవారం పెద్ద దుమారానికి దారితీశాయి. ఉద్యమాన్ని అణచేసేవాళ్లమని, రాష్ట్రాన్ని ఇచ్చి పొరపాటు చేశామన్న వ్యాఖ్యలను జానారెడ్డి ఉపసంహరించుకోవాలని మంత్రి కె తారకరామారావు పట్టుబట్టారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని, తన వ్యాఖ్యల్లోని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని జానారెడ్డి వివరణ ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల వ్యవధి ముగిసిన తర్వాత మిషన్ భగీరథపై జరిగిన చర్చలో కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలేవీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, అలాంటప్పుడు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేది లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో దళితులకు ఉచితంగా భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కెజి టు పిజి వరకు ఉచిత విద్యలాంటి హమీలు గుప్పించి ఒక్కటీ నెరవేర్చలేదని ఎద్దేవా చేస్తూ, ఇప్పుడు ఇంటింటికి మంచినీళ్లంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం చూస్తుంటే నీళ్ల కోసం పైపులు వేస్తున్నట్టు లేదని, పైపులు వేయడం కోసమే నీళ్లిస్తామని చెప్తున్నట్టుందని భట్టి దుయ్యబట్టడంతో మంత్రి కె తారక రామారావు తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి ఆంధ్రలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఒక్క చిత్తూరు జిల్లాలో మంచినీటి కోసం రూ.7000 కోట్లు మంజూరు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో పది జిల్లాల తెలంగాణకు పైసా ఇచ్చేదిలేదన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించని వాళ్లకు, ఇప్పుడు తమను విమర్శించే నైతిక హక్కు ఉందా? అని కెటిఆర్ నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలపై, తామిచ్చిన హామీలపై చర్చకు సిద్ధమని మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి జోక్యం చేసుకుంటూ మిషన్ భగీరథ పథకం మంచిదే కావచ్చు. అయితే దాంట్లో అవకతవకలు జరిగితే ఎత్తిచూపించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉంది. తప్పులు జరిగినా వేలెత్తి చూపకూడదనే ధోరణి మంచిదికాదన్నారు. అంతేందుకు మీరు (తెరాస) ఉద్యమం చేసేటప్పుడు అక్కడ (కేంద్రంలో), ఇక్కడ (రాష్ట్రంలో) మా ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. మిమ్మల్ని అణచేయాలనుకుంటే నిమిషం పట్టేది కాదు. అయినా మేం అలా చేయాలేదని గుర్తించుకొని మాట్లాడాలి. సిపిఎం, సిపిఐ ప్రతినిధులు వస్తే ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం?. ఇప్పుడనిపిస్తుంది తాము పొరపాటు చేశామేమోనని? అంటూ జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే వాళ్లమనడం తీవ్ర అభ్యంతరకరం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పొరపాటు చేశామన్న వ్యాఖ్యలను జానారెడ్డి ఉపసంహరించుకుని తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. తిరిగి జానారెడ్డి జోక్యం చేసుకుంటూ తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని, తన ఉద్దేశాన్ని అపార్థం చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సాధనకు తెరాస ముందుండి ఉండొచ్చు. అయితే రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్ర ఒకటి కాదు, రెండు సింహభాగాలంత ఉందన్నారు. ప్రజా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చినట్టు ప్రకటన చేయగానే ఆంధ్రవారంతా రాజీనామాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు, కెసిఆర్ తన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యవాదులుగా ప్రజా ఉద్యమానికి మద్దతుగా నిలిచి తెలంగాణ ఆవిర్భావానికి తమవంతు కృషి చేశామన్నారు. అప్పుడు ఉద్యమాన్ని అణచివేయాలని ఆలోచించకుండా ప్రజాస్వామ్యవాదులుగా వ్యవహరించామన్నది తన వ్యాఖ్యల్లోని ఉద్దేశమన్నారు. వామపక్ష పార్టీల ప్రతినిధులకు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వని మీకు (తెరాస)లాగే అప్పుడు మేంకూడా చేయకుండా పొరపాటు చేశామేమోనన్న తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని జానారెడ్డి వివరణ ఇవ్వడంతో వాగ్వాదం సమిసింది. అంతకుముందు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ‘నా తెలంగాణ, నా ఆడబిడ్డలు’ అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా జానారెడ్డి తప్పుబట్టారు. నా అనకూడదు, మా తెలంగాణ, మన బిడ్డలు అనాలని సూచించారు.

చిత్రాలు.. జానారెడ్డి, కెటిఆర్