ఆంధ్రప్రదేశ్‌

సౌదీలో 150మంది తెలుగువారి మృతదేహాల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: సౌదీ అరేబియా దేశంలోని ఆసుపత్రుల్లో మగ్గుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది మృతదేహాలను ఇక్కడకు తెచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీచేసింది. గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి సంక్షేమంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటః జి శ్రీ్ధర్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.