రాష్ట్రీయం

రెయిన్ గన్లకో సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 22: రెయిన్‌గన్ల నిర్వహణకు, పట్టణ సుందరీకరణ, లాండ్‌స్కేపింగ్‌కు రెండు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సరైన నిర్వహణ లేకపోతే ఏ యంత్ర పరికరమైనా త్వరగా దెబ్బతింటుందని, అందువల్ల రెయిన్‌గన్ల పర్యవేక్షణకు వీలుగా త్వరలో ఒక సంస్థను ఏర్పాటుచేసి దానికో కార్యనిర్వహణాధికారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజు ప్రాథమిక రంగంపై జరిగిన సమీక్షలో బాబు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో పంట దిగుబడులు పెరగడం సమష్టి కృషికి దక్కిన ఫలితమని అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పురుగు మందుల కొనుగోళ్లపై పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యానవనాల్లో నీటి నిర్వహణ అత్యంత ముఖ్యమన్నారు. ‘గతంలో పంటలను కాపాడేందుకు నీళ్లిచ్చాం, ఇప్పుడు దిగుబడి పెంచేందుకు నీరివ్వాలి’ అని ఆయన సూచించారు.
పట్టణ సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు పట్టణ వౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశాలొస్తాయని చెప్పారు. పట్టణాలు, నగరాల్లో వీధులను శుభ్రం చేసే యంత్ర పరికరాల వల్ల పారిశుద్ధ్య సిబ్బంది తగ్గినా నగర సుందరీకరణ పనుల్లో వారి సేవలను వినియోగించుకోవచ్చునని అన్నారు. ప్రస్తుతం లక్షా 10వేల ఇళ్లను పట్టణ మురికివాడల్లో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇవిగాక 92వేల వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.

చిత్రం..కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు