రాష్ట్రీయం

నగరానికి కొత్త ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22:హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై 13 ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లను (శాటిలైట్ టౌన్‌షిప్)లను అభివృద్ధి చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఈ 13 శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధికి 13,998 కోట్ల రూపాయలు వ్యయమవుతుందన్నారు. పటాన్‌చెరు, తెల్లాపూర్/నాగులపల్లి, కోకాపేట్, తిమ్మాపూర్/ శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, బొంగులూరు, పెద్ద అంబర్‌పేట, ఘట్‌కేసర్, కీసర, షామీర్‌పేట, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి గ్రామాల సమీపాన ఓఆర్‌ఆర్ వెంబడి ఈ గ్రోత్ సెంటర్లను ప్రతిపాదించినట్టు చెప్పారు. సాధ్యాసాధ్యాల నివేదిక రూపకల్పన పూర్తయిందని, సవివరమైన ప్రాజెక్టు నివేదికలను ఇంకా రూపొందించలేదని తెలిపారు. ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వనుంచి సహకారం కోరనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌పై భారం పెరిగిపోతోందని, ఔటర్ రింగ్‌రోడ్డు పై గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఈ భారం తగ్గుతుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించామని, క్రమంగా వీటిని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్టు చెప్పారు. ఉప్పల్‌లో బగాయత్ భూములను బిఓటి పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. కెపి వివేకానంద, ఎం సుధీర్‌రెడ్డి, అంజయ్య తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం తెలిపారు. తన నియోజకవర్గంలో బిఓటి విధానంలో భూములు అప్పగించేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్టు కెటిఆర్ తెలిపారు.