రాష్ట్రీయం

ఐసిస్ ఉగ్రవాదులపై చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ సాయంతో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన ఎనిమిది మంది ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులపైన నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇక్కడి ఎన్‌ఐఏ కోర్టులో గురువారం చార్జిషీటును దాఖలు చేసింది. అబ్దుల్లా బిన్, అహ్మద్ అల్ అమోది అలియాస్ ఫాహద్ (చార్మినార్, హైదరాబాద్), మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ అలియాస్ అబూ అబ్దురెహమాన్ (హైదరాబాద్), హబీబ్ మహమ్మద్ అలియాస్ అబూ షాహిబా (హైదరాబాద్), మహమ్మద్ ఇలియాస్ యజ్దానీ అలియాస్ అబూ మన్సూర్ (తలాబ్‌కట్ట, హైదరాబాద్), ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ అలియాస్ రిజ్వాన్ (హైదరాబాద్), యాసిర్ నరుూమతుల్లా అలియాస్ నరుూమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిన్ (మొగల్‌పురా, హైదరాబాద్), మహమ్మద్ అతల్లా రెహమాన్ అలియాస్ గౌస్ (బండ్లగూడ, హైదరాబాద్), అబ్దుల్లా రవూఫ్ అలియాస్ మహమ్మద్ ఆల్మషరీఫ్‌లపై ఎన్‌ఐఎ పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో మొదటి ఐదుగురు నిందితులు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు కుట్ర, ప్రజా ఆస్తుల విధ్వంసం, రాజద్రోహానికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో కేసులు నమోదు చేశారు.
ఇందులో తొలి ఐదుగురు నిందితులను ఈ ఏడాది 29వ తేదీన ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు వీరి ఇళ్లలో సోదా చేయగా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, సెమి ఆటోమాటిక్ ఆయుధాలు, ఎయిర్ రైఫిల్, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు లభించాయి. వీటి తయారీకి అవసరమైన ముడి సరుకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను విశే్లషించగా, వీరు ఐఎస్‌ఐఎస్ వీడియోలను చూసినట్లు నిర్ధారణ అయింది. ఒక మతాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఉన్నాయి. అన్వర్ ఆవ్లాకి, అబ్దుల్ సామి ఖసామి, మీరజ్ రబ్బాని, తాసిఫ్ ఉర్ రెహమాన్, జెర్జీస్ అన్సారి, జకీర్ నాయక్‌ల ఉపన్యాసాల సిడిలు ఉన్నాయి. ఐఎస్‌ఐఎస్ మ్యాగజైన్ డాబిక్ కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ అధినేతగా, ఖలీఫాగా చెప్పుకుంటున్న అబూబకర్ అల్ బాగ్దాది ఉపన్యాసాలకు వీరు ప్రేరేపితులైనట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. వీరు జుంద్ ఉల్ ఖలరీఫ్ ఫి బిలాడ్ అల్ హింద్ అనే సంస్థను స్థాపించారు. దక్షిణ భారతంలో ఖలీఫా ఆర్మీని ఏర్పాటు చేశారు.
ఐఎస్‌ఐఎస్ సంస్థలో చేరి శిక్షణ పొందిన వారితో నిందితులకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. వీరు తమ మెసేజ్‌లను ఇతరులకు తెలియకుండా ఇంటర్నెట్‌లో డార్క్‌నెట్‌ను ఉపయోగించేవారు. చాట్ సెక్యూర్, టెలిగ్రామ్, టుటనోటా అనే విధానాల ద్వారా చాట్ చేస్తూ సందేశాలను గోప్యంగా ఉంచేవారని అభియోగం మోపారు. చార్జిషీటులో తాము పేర్కొన్న నిందితులందరూ ఉగ్రవాద ముఠా సభ్యులని, వీరికి కుట్రతో సంబంధం ఉందని పేర్కొన్నారు. వీరు ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలు సాగుతున్న సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
వీరు నిధులు సమకూర్చుకోవడమే కాకుండా, ఆ నిధులతో ఆయుధాలను సేకరించారని ఎన్‌ఐఏ తెలిపింది. దేశంలో విధ్వంసం సృష్టించి సమగ్రతను దెబ్బతీసేందుకు వీరు ప్రయత్నించారని, దీనికి ఆధారాలు సేకరించామని ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ కేసులో తొమ్మిదివ నిందితుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఇతర నిందితులు దేశం వెలుపల ఉంటూ రాజద్రోహానికి పాల్పడుతున్న ఘటనలపై దర్యాప్తు సాగుతున్నట్లు పేర్కొన్నారు.