తెలంగాణ

జైళ్లలో స్థితిగతులపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని జైళ్లలో మగ్గుతున్న మహిళా, బాల నేరస్తుల స్థితిగతులను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. జైళ్లలో ఖైదీల స్థితిగతులపై ఏపి లీగల్ సర్వీసెస్ అథారిటీ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. ధర్మాసనం గత నెల 17వ తేదీన జైళ్లపై నివేదిక ఇవ్వాలని ఏపి లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్ శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ జైళ్లలో సదుపాయాలను పర్యవేక్షించే అధికారం లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఉందన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున న్యాయవాది జె అనిల్ కుమార్ వాదనలు వినిపించారు. కాగా ఏపి లీగల్ సర్వీసెస్ అథారిటీ నివేదికను కోర్టుకు సమర్పించింది. వివిధ జైళ్లలో 112 మంది దివ్యాంగులు ఉన్నారని పేర్కొంది. వీరికి సరైన వైద్య సదుపాయాలు లేవన్నారు. ఒక్క రాజమండ్రి జైల్లో వీరికి వైద్య సదుపాయాలు ఉన్నాయన్నారు. నలుగురు గర్భవతులు, 35 మంది పిల్లలు జైళ్లలో ఉన్నారన్నారు.