రాష్ట్రీయం

175 సీట్లు మనవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 23: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని, ఇటీవల సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడైందన్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కల్పనతోపాటు నియోజకవర్గంలోని వైకాపా ప్రజాప్రతినిధులను ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలోనే ఉందని, అక్కడి ఎమ్మెల్యే టిడిపిలో చేరటం సంతోషకరమన్నారు. కల్పన చేరికను ప్రస్తావిస్తూ వర్ల రామయ్య మాదిరిగా మిగిలిన నియోజకవర్గాల నాయకులు సహకరించాలని, రాష్ట్భ్రావృద్ధి కోసం అంతా సమష్టిగా పని చేయాలని ఆయన కోరారు.
సొంత ఇంటికి వచ్చినట్లుంది : కల్పన
తెలుగుదేశం పార్టీలోకి మరోసారి రావడం స్వగృహంలో అడుగుపెట్టినట్లుందని ఈసందర్భంగా ఎమ్మెలే ఉప్పులేటి కల్పన అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీచేసి ఓడిపోయానని, కొన్ని కారణాల వల్ల వైసిపిలోకి వెళ్లినా ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేపోతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే టిడిపిలో చేరినట్లు చెప్పారు.పార్టీలోకి పునఃప్రవేశించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు తాను అన్నలా తోడుంటానని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ వర్ల రామయ్య అన్నారు. కల్పన చేరిక సందర్భంగా స్వయంగా పార్టీ కండువాను తన చేతులమీదుగా చంద్రబాబుకు అందచేసి స్వాగతం పలికారు. కల్పనతోపాటు నియోజకవర్గంలోని ఇద్దరు జెడ్పీటిసిలు, 14మంది ఎంపిటిసిలు, 12మంది సర్పంచ్‌లు పార్టీలో చేరారు.

చిత్రం..వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సిఎం చంద్రబాబు