రాష్ట్రీయం

జిఎస్టీ పరిహారంపై ఏకాభిప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జిఎస్టీ అమలువల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి కేంద్రం చెల్లించాల్సిన పరిహారంపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రాలకు పరిహారం చెల్లించే అంశానికి చట్టరూపమిచ్చి, ప్రతి రెండు నెలలకు ఒకసారి పరిహారం చెల్లించేలా ఒప్పందం కుదిరిందని ఆయన వివరించారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన జిఎస్టీ మండలి సమావేశంలో తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు పరిహారం సరిపోనప్పుడు గ్రాంట్‌రూపంలో ఇచ్చి, దాన్ని ఎలా తిరిగి చెల్లించాలనే అంశంపైనా సమావేశంలో చర్చించామన్నారు. పరిహారాన్ని ఏమేరకు ఇవ్వాలన్న అంశాన్ని నిర్ణయించేందుకు 2015-16 ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాల ఆధారంగా 14.5 శాతం వృద్ధిరేటు ప్రకారం లెక్కగట్టాలని నిర్ణయించారన్నారు. జిఎస్టీ మండలి తదుపరి సమావేశం జనవరి 3, 4 తేదీల్లో మరోసారి జరుగుతుందన్నారు. మొత్తం పన్నుల్లో పెద్దమొత్తం చెల్లించే 10 శాతం డీలర్లను కేంద్రం పరిధిలో ఉంచి, చిన్న మొత్తంలో పన్ను వసూలయ్యే 90 శాతం డీలర్లను రాష్ట్రాలకు పరిమితం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. జిఎస్టీ అమలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు మంత్రి ఈటల స్పష్టత ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం దేశ జీడీపీతోపాటు రాష్ట్రాలపైనా ఉందని, దీనిపై కేంద్రం దృష్టి సారించాలని కోరామన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉందని, దాని ప్రకారం కొత్త నోట్లను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటివరకు కేవలం తెలంగాణకు కొత్త నోట్లు రూ.20వేల 500 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇంకా 30 వేల కోట్లమేర కొత్త కరెన్సీ రావాల్సి ఉందన్నారు. ఇకపై తెలంగాణకు ఇచ్చే కొత్త నోట్లలో చిన్న నోట్లు ఇవ్వాలని కోరామన్నారు. అలాగే ఏ వస్తువు ఏ టాక్స్ స్లాబ్‌లో ఉండాలనే విషయం మీదా తర్వాత జరిగే భేటీలో చర్చిస్తామన్నారు. సామాన్యులకు రోజువారీ అవసరాల వస్తువులపై తక్కువ స్లాబ్‌లో రేటు ఉండాలని కేంద్రానికి సూచించినట్టు చెప్పారు.